మాస్ మాహారాజా రవితేజకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర జాతరే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు రవితేజ. ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో భాగ్య శ్రీ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అయితే హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం తన కెరీర్ లో 75వ ప్రాజెక్టు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఇదిలా ఉంటే.. రవితేజకు లవర్ గా, భార్యగా, వదినగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ? తనే హీరోయిన్ శ్రుతి హాసన్. నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో వీరిద్దరి కాంబోలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన బలుపు సినిమాలో ఇద్దరు జంటగా నటించారు. ఇందులో రవితేజ లవర్ గా కనిపించింది శ్రుతిహాసన్. ఆ తర్వాత వీరిద్దరు కలిసి క్రాక్ సినిమాతో మరోసారి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇందులో రవితేజ భార్యగా కనిపించింది. ఇక రవితేజకు శ్రుతి హాసన్ వదినగా కనిపించిన సినిమా ఏది అని ఆలోచిస్తున్నారా..? ఆ సినిమా పేరు వాల్తేరు వీరయ్య. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా నటించారు రవితేజ. ఇందులో చిరు సరసన కథానాయికగా మెరిసింది శ్రుతిహాసన్. అంటే ఈ సినిమాలో రవితేజకు శ్రుతి హాసన్ వదిన అన్నమాట. అలా రవితేజకు లవర్ గా, భార్యగా, వదినగా నటించిన హీరోయిన్ శ్రుతి హాసన్. చివరిసారిగా ఈ అమ్మడు సలార్ చిత్రంలో కనిపించింది. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.