Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Shathabdhi Utsavalu: నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు NTR శతాబ్ది అవార్డు.. సూర్యచంద్రులున్నంతకాలం అన్న ప్రజల మదిలోనే..

నందమూరి తారకరామారావు శతాబ్ది పురస్కారం ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆవార్డు గ్రహీత సినీ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు మీద సన్మానం చేసి అవార్డు ఇవ్వటం జన్మలో మర్చిపోలేను అన్నారు. సినీరంగంలో ఎన్టీఆర్‌ను మించిన నటులు లేరని, రాముడు చేసిన, రావణాసురుడు చేసినా ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు.

NTR Shathabdhi Utsavalu: నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు NTR శతాబ్ది అవార్డు.. సూర్యచంద్రులున్నంతకాలం అన్న ప్రజల మదిలోనే..
Ntr Shatabdi Award
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2023 | 7:39 AM

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్వర్యంలో తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డును సినీ నటుడు నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ అందుకున్నారు.  ఎన్టీఆర్ సోదరుని కుమారుడు నందమూరి రాంప్రసాద్ చేతుల మీదుగా రాజేంద్ర ప్రసాద్ కు అందజేశారు. తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిలుగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ నిమ్మల రామా నాయుడు హాజరయ్యారు.

అభిమాన సత్కారం నందమూరి తారకరామారావు శతాబ్ది పురస్కారం ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆవార్డు గ్రహీత సినీ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు మీద సన్మానం చేసి అవార్డు ఇవ్వటం జన్మలో మర్చిపోలేను అన్నారు. సినీరంగంలో ఎన్టీఆర్‌ను మించిన నటులు లేరని, రాముడు చేసిన, రావణాసురుడు చేసినా ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. ఎన్టీ రామారావు తో తనకున్న అనుబంధాన్ని సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ నాకు గురువు దైవం ఆయనేనన్నారు. సంవత్సరం పాటు ఎవ్వరు చేయని విధంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో చేయటం గర్వంగా ఉందని భావిస్తున్నాను అన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ సూర్యచంద్రులు ఉన్నంత కాలం ప్రజల మదిలో నిలిచే ఉంటారని చెప్పారు.

సినీ కెమెరామెన్‌ గోపాలరెడ్డి, సినీ పాత్రికేయుడు యు.వినాయకరావు, సినీ రచయిత ఎం.ఎస్‌ శాస్త్రి, ఎన్టీఆర్‌ సోదరుని కుమారుడు నందమూరి రాంప్రసాద్‌, విజయవాడ యాక్స్‌ టైలర్‌ వాలేశ్వరరావు, చిత్రశాల ప్రసాద్‌, బుర్రా సాయిమాధవ్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..