Jr NTR :ఆ మాత్రం కూడా నీకు తెలియదా ఓం భయ్యా..! రావణబ్రహ్మ గురించి తారక్ ఏమన్నాడంటే..
రామాయణ నేపథ్యంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై ఆది నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాలో రామాయణంని తప్పుగా చూపించారని మండిపడుతున్నాయి హిందూ సంఘాలు.

ఆదిపురుష్ .. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిసనన్ నటించింది. రామాయణ నేపథ్యంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై ఆది నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాలో రామాయణంని తప్పుగా చూపించారని మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. పురాణాల్లో ఉన్న రామాయణ ఇతిహాసాన్ని మర్చి తీశారని ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్ కూడా పూర్ గా ఉండటంతో అభిమానులను కూడా ఈ సినిమా నిరాశపరిచింది. ఆదిపురుష్ ప్రభాస్ క్రేజ్ వల్ల కలెక్షన్స్ అయితే బాగానే రాబడుతోంది కానీ.. ఇప్పుడు ఆ కలెక్షన్స్ కూడా పడిపోయాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ముఖ్యంగా రావణాసురిడి పాత్ర ను చూపించిన విధానం పై కూడా మండిపడుతున్నారు. రావణాసురుడికి స్పైక్స్ పెట్టడం.. మాస్క్ లు పెట్టడం, పాములతో మసాజ్ చేయించుకోవడం వంటివి చూపించారు ఓం రౌత్.
అలాగే బంగారు నగరంగా పిలవబడే లంకానగరాన్ని ఎదో బొగ్గుగనుల మధ్య మసిపట్టిన బంగ్లాగా నల్లగా చూపించారు. కనీసం సీతమ్మ ఉండే అశోక వనంను కూడా పచ్చగా చూపించలేక పోయారు. దాంతో ఈ సినిమా పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ రావణాసురిడి గురించి గతంలో చేసిన కామెంట్స్ యూ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్
జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ రావణాసురిడి భక్తుడిగా.. ఆయనను పోలిన స్వభావం కలిగిన పాత్రను పోషించారు. ఆ సినిమా సమయంలో ఓ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ.. రావణాసురుడి గొప్పతననని ఎంతో చక్కగా వివరించారు. ఇప్పుడు ఆ కామెంట్స్ ను షేర్ చేస్తూ.. పాత్ర పోషించిన ఎన్టీఆర్ రావణాసురుడి గురిని ఎంతగా తెలుసుకొని సినిమా చేస్తే.. ఇంత పెద్ద సినిమా చేసిన దర్శకుడు ఓం రౌత్ ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా రావణాసురిడి పాత్రను డిజైన్ చేశారని ఫైర్ అవుతున్నారు. రామాయణం చదవకుండా.. హాలీవుడ్ సినిమాలు చూసి సినిమాలు తీస్తే ఇలానే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
@tarak9999 did research like this for a small character then how much research should be done to make Ravan’s Character 🤷♂️#ManOfMassesNTR #Ntr30 #Devara #Ravana pic.twitter.com/9leIW2FQf3
— Narasimha (@NTRNarasimha_) June 19, 2023




