
జక్కన్న బాగా పిండేశాడు.. జంతువులా వెంటబడి నన్నూ ఒక జంతువులా మార్చేశాడు.. అని రాజమౌళిని ఒక పని రాక్షసుడిగా ప్రజంట్ చేస్తూ వచ్చారు ఎన్టీఆర్(Jr NTR). బట్… ఇటువంటి పని రాక్షసులు తారక్ కెరీర్‌లో కొత్తేం కాదు! మాక్కావల్సింది మాకూ ఇవ్వు అంటూ వెంటబడే కెప్టెన్లు గతంలోనూ, ముందుముందు చాలామందే వున్నారు. ఐతే ఏంటి.. ఫికర్ మత్‌కరో అంటున్నారు యంగ్‌టైగర్. ట్రిపులార్‌లో కొమురం భీముడి గెటప్ కోసం జక్కన్న సూచన మేరకు బరువు బాగా గెయిన్ అయ్యారు ఎన్టీఆర్. లాయడ్ స్టీవెన్స్ అనే ఫిట్‌నెస్ ట్రయినర్ దగ్గర భీకరమైన కసరత్తులు చేసి.. కొమురం భీముడిగా స్క్రీన్ మీద నిండుగా కనిపించి సక్సెస్ కొట్టారు. కానీ.. ఇప్పుడా ఛాలెంజ్ ముగిసింది. రీసెంట్‌గా అరవింద సమేతుడిగా ఫైట్ సీక్వెన్సెస్‌లో షర్ట్‌లెస్‌గా కనిపించి సిక్స్‌ప్యాక్ హీరో అనిపించుకున్నారు ఎన్టీఆర్. అంతకుముందు జనతాగ్యారేజ్‌లో అయితే కనిపించీ కనిపించకుండా కాస్త బొద్దుగా అనిపించారు తారక్. ఇప్పుడు ఎన్టీయార్ థర్టియత్ మూవీకి దాదాపుగా అటువంటి ఫిజిక్కే కావాలని పట్టుపట్టారట డైరెక్టర్ కొరటాల.
జక్కన్న క్యాంప్ నుంచి బైటపడ్డాక ఇప్పుడు మేకోవర్ పనుల్లోనే బిజీగా వున్నారు యంగు యముడు. రెండునెలల్లోగా కనీసం ఎనిమిది కిలోలైనా తగ్గాలన్నది టార్గెట్. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా కోసం కబడ్డీ కోచ్‌గా కనిపించడానికి మళ్లీ కండలు పెంచాల్సిందే.. తప్పదు మరి. ఇలా వెంటవెంటనే ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం కష్టపడ్డం ఎన్టీఆర్ కి అలవాటే. స్టూడెంట్ నంబర్1లో లావుగా.. చూడ్డానికి అసహ్యంగా వున్నావ్ అని మొహమ్మీదే చెప్పేసిన రాజమౌళి.. తర్వాత సింహాద్రి, యమదొంగ కోసం తనక్కావల్సినట్టు ఎన్టీఆర్ ను మార్చేసుకున్నారు. ఆ గ్యాప్‌లోనే వంశీ పైడిపల్లి రామయ్యా వస్తావయ్యాలో కరెంట్ తీగలా సన్నగా మారిపోయారు. పూరి కోసం టెంపరున్న పోలీసాఫీసర్‌గా మళ్లీ మేకోవర్ అయ్యారు. ఇలా.. ఎవరెలా కావాలంటే అలా తనను తాను మార్చుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్ వర్కింగ్ స్టయిల్. ఆయన సీక్రెట్టాఫ్ సక్సెస్ కూడా అదే.
మరిన్ని ఇక్కడ చదవండి :