Devara: దేవర అడుగెడితే.. రక్కసుల రక్తం కడలిపాలవ్వాలా…

"సూరీడు పొద్దు పొడిచినా.. పొద్దు పూకినా.. ఆ నీలాకాశం ఎర్రగా ఎలా మారుతుందో..! ఈ దేవర అడుగెడితే చాలు.. ఎగిసిపడే కడిలి ముంగిట.. ఎర్రటి నెత్తురు పారుతుంది. కడలిని ముంచెత్తి.. సంద్రం రంగు మారేలా చేస్తుంది. స్వచ్చంగా వీచే గాలి రక్త మాంసాల వాసనతో బరువెక్కుతుంది.

Follow us

|

Updated on: Jul 28, 2023 | 9:45 AM

“సూరీడు పొద్దు పొడిచినా.. పొద్దు పూకినా.. ఆ నీలాకాశం ఎర్రగా ఎలా మారుతుందో..! ఈ దేవర అడుగెడితే చాలు.. ఎగిసిపడే కడిలి ముంగిట.. ఎర్రటి నెత్తురు పారుతుంది. కడలిని ముంచెత్తి.. సంద్రం రంగు మారేలా చేస్తుంది. స్వచ్చంగా వీచే గాలి రక్త మాంసాల వాసనతో బరువెక్కుతుంది. పసిడి రంగులో ఉన్న ఇసుక.. చచ్చిపడిన శవాలతో నిండిపోతుంది. రక్కసుల రక్తం మాంసాలను చీల్చుతున్న దేవరను చూసి.. దిక్కులే బిక్కటిల్లే పరిస్థితి వస్తుంది. కానీ తనను దేవుడిగా కొలుస్తున్న తీర ప్రాతం ప్రజల్లో మాత్రం తమకు కొండంత అండగా.. దేవుడిగా.. దేవర ఉన్నాడనే ధైర్యం పుడుతుంది.!” అదోకే! అసలిదేంటని అంటారా..! దేవర సినిమా ప్రెడిక్షన్! దేవర పోస్టర్‌ కాన్సెప్ట్ డిజైన్!

ఎస్ ! ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో.. దేవర సినిమా చేస్తున్నారు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న తారక్.. ఈసినిమాతో మన అందిరి ముందుకు రావడమే కాదు.. ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడే రిలీజ్‌ చేసిన వీడియో గ్లింప్స్తో.. అందర్లో గూస్ బంప్స్ వచ్చేలా చేశారు. ఇక ఆ తరువాత రిలీజ్ అయిన తన లుక్‌తో.. ఆ గూస్ బంప్స్‌ ను మరింతగా పెరిగేలా చేశారు.

ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా అప్డేట్స్‌ కోసం.. ఈ సినిమా డెవలప్‌మెంట్స్‌ కోసం తారక్‌ ముందు అరిచి గీపెట్టుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు.. తమ స్కిల్స్‌కు పని పెట్టారు. అప్పటికే దేవర మూహూర్త కార్యక్రమంలో కొరటాల చెప్పిన స్టోరీ లైన్‌ను ఊహించుకుంటూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్‌ను చాలా వైల్డ్ గా డిజైన్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. దాంతో పాటే.. దేవర ఊచకోతకు.. సముద్రం ముంగిట రక్తం ఏరులై పారుతుందంటూ.. కాన్సెప్ట్ పోస్టర్స్ డిజైన్ చేసి.. ఈ సినిమా హైప్‌ను మరింత పెరిగేలా చేస్తున్నారు. ఆ భయాన్ని భయపెట్టే వాడు ఒకడొచ్చాడని.. పల్లెల్లో తెలిసేలా రక్తం ధారలు ఉన్న విలేజ్‌ ఫోటోలను … డిజైన్ చేసి మరీ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. మేకర్స్ ఇచ్చే అప్డేట్స్‌ ను .. లీక్స్‌ను మాగ్జిమమ్ ఫాలో అవుతూ.. ఈ సినిమాను వారి వారి పోస్టర్స్లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు… తారక్ డై హార్డ్ ఫ్యాన్స్.