18 Pages: నిఖిల్ నయా సినిమాకు కార్తికేయ2 తెచ్చిన కొత్త కష్టాలు.. రీషూట్ దిశగా 18 పేజెస్

యంగ్ హీరో నిఖిల్ రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లో వచ్చిన సినిమాలన్నీ చేసిన నిఖిల్ స్వామిరారా సినిమానుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

18 Pages: నిఖిల్ నయా సినిమాకు కార్తికేయ2 తెచ్చిన కొత్త కష్టాలు.. రీషూట్ దిశగా 18 పేజెస్
18 Pages
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2022 | 8:16 PM

యంగ్ హీరో నిఖిల్(Nikhil Siddhartha)రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లో వచ్చిన సినిమాలన్నీ చేసిన నిఖిల్ స్వామిరారా సినిమానుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. ఇక చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కృష్ణుడి కడియం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా కు బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లు లభించాయి. విడుదల చేసిన అన్నిభాషల్లో కార్తికేయ2 సినిమా మంచి హిట్ అయ్యింది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత నిఖిల్ 18 పేజెస్(18 Pages) అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

సుకుమార్ రైటింగ్ పై ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ సినిమాలో నిఖిల్ విభిన్న మైన పాత్రలో కనిపించనున్నాడట. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కొత్త కష్టం వచ్చిందని తెలుస్తోంది. 18 పేజెస్ మూవీని రీషూట్ చేస్తున్నారని తెలుస్తోంది. కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నిఖిల్ 18 పేజెస్ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. త్వరలో వాటిని పూర్తి చేసి సినిమాను రిలీజ్‌ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది..  ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..