AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddharth: స్పై మూవీ కోసం లైవ్ వెపన్ ట్రైనింగ్ తీసుకుంటున్న కుర్ర హీరో

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ వరుస సినిమాలతో ఫుల్ జోరుమీదున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు.

Nikhil Siddharth: స్పై మూవీ కోసం లైవ్ వెపన్ ట్రైనింగ్ తీసుకుంటున్న కుర్ర హీరో
Nikhil Siddharth
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2022 | 7:10 PM

Share

Nikhil Siddharth: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ వరుస సినిమాలతో ఫుల్ జోరుమీదున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. వాటిలో ఒకటి కార్తికేయ సినిమాకు సీకేవల్ గా తెరకెక్కిన కార్తికేయ 2. మరొకటి 18 పేజెస్. వీటితోపాటు ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు ఈ కుర్ర హీరో. నిఖిల్ 19వ చిత్రానికి గూఢచారి, ఎవరు, హిట్ వంటి హిట్ చిత్రాల ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎడ్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ మార్చి నుండి మనాలీలో ప్రారంభమవుతుంది.

ఈ షెడ్యూల్లో కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనుంది యూనిట్. వాటికోసం నిఖిల్ ఊపిరి బిగబట్టే స్టంట్స్ చేయడానికి శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం నిఖిల్ లైవ్ వెపన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఫోటోలను పంచుకున్నారు. యాక్షన్ తో కూడిన స్పై థ్రిల్లర్గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ కన్పర్మ్ చేయాల్సిఉంది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయ్యింది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్లో ప్రముఖ సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు. జూలియన్ అమరు ఎస్ట్రాడా సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా, దర్శకుడు గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ భాద్యతల్ని కూడా నిర్వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alia Bhatt : నేను ఎక్కువగా భయపడింది అప్పుడే.. ప్రతిచోటా నన్ను వెంటాడేది.. అలియా భట్ షాకింగ్ కామెంట్స్..

Raadhika Sarathkumar: తెలుగు సినిమాల్లో న‌టించ‌డం నాకు చాలా ఇష్టం: రాధిక శ‌ర‌త్‌కుమార్

Aha Indian Idol Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం..