Nikhil Siddhath: మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో నిఖిల్.. ఆసక్తిని క్రియేట్ చేస్తోన్న పోస్టర్..

ఈ ఏడాది కార్తికే 2, 18 పేజిస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు స్పై చిత్రంలో నటిస్తున్నారు. సుభాష్ చంద్రభోస్ మరణం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే..నిఖిల్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు.

Nikhil Siddhath: మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో నిఖిల్.. ఆసక్తిని క్రియేట్ చేస్తోన్న పోస్టర్..
Nikhil

Updated on: Jun 01, 2023 | 3:13 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్త్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి రోజు రోజుకు రేంజ్ పెంచుకుంటున్నాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద బ్యానర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ ఏడాది కార్తికే 2, 18 పేజిస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు స్పై చిత్రంలో నటిస్తున్నారు. సుభాష్ చంద్రభోస్ మరణం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే..నిఖిల్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్‏ను రిలీజ్ చేశారు. అందులో ఒక ఖ‌డ్గం త‌ర‌హాలో ఉన్న ఆయుధంతో ఈ సినిమా ప్రీ లుక్‌ను ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేశారు.

ఈ సినిమా యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథ అని తెలుస్తుంది. ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.రవి బసృర్ సంగీతం ను అందిస్తున్నారు. ఇక ఈరోజు గురువారం (జూన్ 1) నిఖిల్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇవే కాకుండా.. నిఖిల్ ఇటీవల రామ్ చరణ్ నిర్మాణంలో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ది ఇండియా హౌస్ పేరుతో రామ్ చరణ్ నిర్మాతగా వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై మొదటి సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా 1900 దశకంలో భారతదేశ చరిత్రలో జరిగిన కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం.