Nikhil Siddhartha: మాటనిలబెట్టుకోలేకపోయా.. మన్నించండి.. అభిమానులకు నిఖిల్‌ క్షమాపణలు.. కారణమిదే

కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌. ఈ మూవీతోనే పాన్‌ ఇండియా హీరోగా కూడా మారిపోయాడు. తాజాగా ఇదే జోష్‌ లో 'స్పై' అనే మరో పాన్‌ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గ్యారీ బీ హెచ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్యా మేనన్‌ హీరోయిన్‌గా నటించింది.

Nikhil Siddhartha: మాటనిలబెట్టుకోలేకపోయా.. మన్నించండి.. అభిమానులకు నిఖిల్‌ క్షమాపణలు.. కారణమిదే
Nikhil Siddharth

Updated on: Jul 05, 2023 | 4:05 PM

కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌. ఈ మూవీతోనే పాన్‌ ఇండియా హీరోగా కూడా మారిపోయాడు. తాజాగా ఇదే జోష్‌ లో ‘స్పై’ అనే మరో పాన్‌ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గ్యారీ బీ హెచ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్యా మేనన్‌ హీరోయిన్‌గా నటించింది. సుభాష్‌ చంద్రబోస్‌ మిస్టరీ డెత్ నేపథ్యంలో స్పై తెరకెక్కింది. జులై 29న వచ్చిన నిఖిల్‌ సినిమాకు కాస్త డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లలో దుమ్మురేపింది. మొదటి రోజే రూ.11 కోట్లు రాబట్టిన స్పై .. 5 రోజుల్లో ఏకంగా రూ. 28.90 కోట్లు వసూళ్లు చేసింది. ఈక్రమంలో సినీ ప్రేక్షకులకు, అభిమానులకు క్షమాపణలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ లేఖను విడుదల చేశాడు నిఖిల్‌. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో స్పై రిలీజ్‌ కాకపోవడంపై చింతిస్తున్నానంటూ, మరోసారి ఇలా జరగదంటూ మాటిచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘స్పై సినిమాకి నా కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ను అందించారు. అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై మీరు ఇంత నమ్మకం ఉంచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నాపై ఉన్న నమ్మకంతో చాలా మంది ఫ్యాన్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుని టికెట్లు కొన్నారు. అయితే కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల కారణంగా పాన్‌ ఇండియా స్థాయిలో స్పై మూవీని రిలీజ్‌ చేయలేకపోయాం. ఓవర్సీస్​లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. హిందీ, కన్నడ, తమిళం, మలయాళం ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెపుతున్నా. ఎందుకంటే కార్తికేయ-2 సినిమాతో నేను మీ అందరికీ దగ్గరయ్యాను. కానీ స్పై సినిమాను మాత్రం మీ అందరికీ అందించలేకపోయాను. స్పై తర్వాత నా నుంచి రాబోయే 3 సినిమాలను అన్ని భాషల్లోని థియేటర్లలో కచ్చితంగా అనుకున్న సమయానికి రిలీజ్‌ అవుతాయని మాటిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన తెలుగు సినిమా ప్రేక్షకులు, అభిమానులకు కూడా మాటిస్తున్నా. ఇక నుంచి సినిమా క్వాలిటీ, కంటెంట్‌ విషయంలో ఏ మాత్రం తగ్గను. నాపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా మీకు మాత్రం మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను అందిస్తానని మాటిస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నాడు నిఖిల్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.