Nikhil Siddharth: నన్ను చాలాసార్లు డ్రగ్స్ తీసుకోమన్నారు.. నిఖిల్ సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్..

|

Jun 24, 2023 | 5:27 PM

డ్రగ్స్‌కు అందరూ దూరంగా ఉండాలని.. నార్కోటిక్స్‌కు అలవాటు పడితే అది మరణమే అని అన్నారు యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్. శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో హీరో ప్రియదర్శితోపాటు.. నిఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Nikhil Siddharth: నన్ను చాలాసార్లు డ్రగ్స్ తీసుకోమన్నారు.. నిఖిల్ సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్..
Nikhil
Follow us on

డ్రగ్స్‌కు అందరూ దూరంగా ఉండాలని.. నార్కోటిక్స్‌కు అలవాటు పడితే అది మరణమే అని అన్నారు యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్. శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో హీరో ప్రియదర్శితోపాటు.. నిఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిఖిల్ మాట్లాడుతూ.. ” నన్ను చాలాసార్లు డ్రగ్స్‌ తీసుకోవాలని ఆఫర్‌ చేశారు.. కానీ నేను డ్రగ్స్‌ తీసుకోలేదు. నార్కోటిక్స్‌కు అలవాటు పడితే అది ఇక మరణమే. అలాంటి వాటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను. పార్టీలకు వెళ్లండి కానీ డ్రగ్స్‌ మాత్రం తీసుకోకండి. త్వరలో డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ అవ్వాలి” అని అన్నారు.

అలాగే హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “10 ఏండ్ల క్రితం సిగరెట్ తాగాను…దానికి బానిస కావొదు అనుకున్నాను. కొంత కాలం తర్వాత నాకు పరివర్తన వచ్చింది సిగరెట్ మనేసాను. ఇప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూష్ లేకుండా హ్యాపీగా ఉన్నాను. డ్రగ్స్ వినియోగం పై అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఇలాంటి అవెర్న్స్ ప్రోగ్రాం నార్కోటిక్స్ విభాగం చేయడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. నార్కోటిక్స్ వింగ్ పోలీసులకు నా సెల్యూట్” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అవగాహన సదస్సులు మూడు రోజులపాటు జరగనున్నాయి. అలాగే 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తగా డ్రగ్స్ నిర్మూలన పై ప్రచారం నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, & భారతి హోల్లికేరి IAS Spl. ప్రభుత్వ కార్యదర్శి పాల్గొన్నారు.