Karthikeya 2 : హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న ‘కార్తికేయ 2’.. మూడురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

|

Aug 16, 2022 | 6:57 PM

సీన్ సితారైంది. చిన్న చూపు చూసిన సినిమానే.. ఇప్పుడు వెండితెరపై వెలుగుతోంది. ఒక్క టాలీవుడ్లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియాలో కలెక్షన్ల ఖాతాను తెరిచేసింది. తెరిచేయడమే కాదు..

Karthikeya 2 : హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న కార్తికేయ 2.. మూడురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
Kathikeya 2
Follow us on

సీన్ సితారైంది. చిన్న చూపు చూసిన సినిమానే.. ఇప్పుడు వెండితెరపై వెలుగుతోంది. ఒక్క టాలీవుడ్లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియాలో కలెక్షన్ల ఖాతాను తెరిచేసింది. తెరిచేయడమే కాదు.. పరిగెత్తిస్తోంది కూడా..! పరగెత్తించడమే కాదు.. కార్తికేయ2 సూపర్ హిట్ అనే మౌత్‌ టాక్ ను వైరల్ అయ్యేలా చేస్తోంది కూడా.. హిట్‌ ఫిల్మ్ కార్తికేయకు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం కార్తికేయ2(Karthikeya 2). హీరో నిఖిల్ అండ్ డైరెక్టర్ చందుముండేటి.. చాలా కష్టపడి తెరెక్కెక్కించిన ఈ సినిమా… థియేటర్లు దొరక్కపోవడంతో.. రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో సార్లు నిఖిల్ తన ఆవేధనను మీడియా ముందు వ్యక్తం చేసేలా చేసింది. ఇక దీంతో చేసేదేం లేక చివరకు కాంప్రమైజ్ అయ్యారు నిఖిల్ అండ్ టీం. థియేటర్లు తక్కువైన పర్లేదంటూ.. ఆగస్టు 13న రిలీజ్ చేశారు. జస్ట్ ఫస్ట్ షోతో నే.. దిమ్మతిరిగే పాజిటివ్‌ టాక్‌ను ఫిల్మ్ లవర్స్ నుంచి వచ్చేలా చేసుకున్నారు. తమ కష్టానికి ఫలితం తగ్గిందంటూ.. ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు.. ఎట్ ప్రజెంట్ థియేటర్లను విజిట్ చేస్తూ.. నానా హంగామా చేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. తాజాగా కార్తికేయ 2 బాక్సాఫీస్ను రఫ్పాడిస్తోందట. రోజు రోజుకూ.. థియేటర్ల సంఖ్య పెరుగుతుండడంతో.. కలెక్షన్స్ గ్రాఫ్ పరుగెడుతోందట. ఇక అకార్డింగ్ టూ లెటెస్ట్ రిపోర్ట్ కార్తికేయ2.. రిలీజైన మూడు రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా 26.50 క్రోర్ గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిందట. ఇక తెలుగు టూ స్టేట్స్‌ లో అయితే.. 17.80 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసిందట ఈసినిమా. ఇక ఇప్పుడీ ఫిగర్స్ అటు టాలీవుడ్లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ.. వెరీ హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.