AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: ‘జీవితంలో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి’.. నిహారిక ఎమోషనల్ కామెంట్స్..

ప్రేమ.. వివక్షతో నిండిపోయిన సమాజాన్ని ఎదిస్తుంది.. ఓడిస్తుంది.. ప్రేమ ఎటువంటి క్లిష్టమైన సవాలునైనా ఎదుర్కొంటుంది అనే అంశాలను ప్రధానంగా తీసుకుని వ్యవసాయం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చి మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, తదితరవాటిల్లో మార్చి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Niharika Konidela: 'జీవితంలో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి'.. నిహారిక ఎమోషనల్ కామెంట్స్..
Niharika Konidela
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2024 | 6:49 AM

Share

వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సాగు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీని డాక్టర్ యశస్వి వంగా నిర్మించారు. ప్రేమ.. వివక్షతో నిండిపోయిన సమాజాన్ని ఎదిస్తుంది.. ఓడిస్తుంది.. ప్రేమ ఎటువంటి క్లిష్టమైన సవాలునైనా ఎదుర్కొంటుంది అనే అంశాలను ప్రధానంగా తీసుకుని వ్యవసాయం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చి మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, తదితరవాటిల్లో మార్చి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ మూవీని హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు మేకర్స్. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కోసం చిత్రయూనిట్ సభ్యులతోపాటు.. నిహారిక కొణిదెల హాజరయ్యారు. స్క్రీనింగ్ అనంతరం మీడియాతో ముచ్చటించింది టీమ్. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయని.. వాటన్నింటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలని అన్నారు.

“సాగు సినిమా నా మనసుకు చాలా దగ్గరైంది. హృదయాన్ని హత్తుకున్న మూవీ ఇది. ఇంతకుముందు ఓసారి ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించినప్పుడు నేను అతిథిగా హాజరయ్యాను… జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ వాటి గురించి బాధపడకుండా ముందుకెళ్లాలని తెలియజేసే ఈ మూవీకి కనెక్ట్ అయ్యాను. సమస్యను ఎదురైనప్పుడు ఒక్క అడుగులో ఓటమిని అంగీకరించకూడదు అని అందరికీ అర్థమయ్యేలా చెప్పే సినిమా ఇది. నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అలాగే రైతుల కష్టాన్ని, వారి విలువను చాటి చెబుతుంది. కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చు. నాకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది” అని అన్నారు.

52 నిమిషాలున్న ఈ షార్ట్ ఫిల్మ్ ను 4 రోజుల్లో చిత్రీకరించారు. ఇలాంటి యంగ్ టీంను సపోర్ట్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ నా వద్దకు తీసుకొచ్చిన అంకిత్ కు థాంక్స్. ఇలాంటి సబ్జెక్ట్ తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టాన్ని దగ్గరుండి చూడలేదు.. కానీ వారి కష్టాన్ని తెలిపే సినిమాను తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను సమర్పిస్తున్నాను. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ మరిన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది నిహారిక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us