Chaitanya Jonnalagadda: ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నిహారిక భర్త.. నన్ను ఇలా చేసిన వారందరికీ చాలా థాంక్స్ అంటూ..
లాక్ డౌన్ సమయంలో నిహారిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. పెళ్లైన తర్వాత వీరు ఎంతో అన్యున్యంగా ఉన్నారు.
మెగా డాటర్ నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది నిహారిక. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది ఈ భామ. కానీ సినిమాల్లో అంతగా రాణించలేక పోయింది. ఇక లాక్ డౌన్ సమయంలో నిహారిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. పెళ్లైన తర్వాత వీరు ఎంతో అన్యున్యంగా ఉన్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ వివిడిగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ వీరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరు విడిపోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక మెగా ఫ్యామిలీ లో జరుగుతున్న సంబరాల్లో నిహారిక ఒక్కరే కనిపిస్తుండటంతో వీరు విడిపోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే జరిగిన నిహారిక అన్న వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్ మెంట్ లో.. రామ్ చరణ్ ఉపాసన కూతురు బారసాలలో నిహారిక ఒక్కరే కనిపించారు. ఎక్కడ చైతన్య కనిపించలేదు. అయితే విడిపోతున్నారని వస్తున్న వార్తల పై నిహారిక, చైతన్య ఇద్దరూ ఎక్కడ స్పందించలేదు.
తాజాగా చైతన్య షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పెళ్ళైన మొదట్లో చైతన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు అంతగా కనిపించడంలేదు. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఓ మెడిటేషన్ సెంటర్ ఫోటోను షేర్ చేసిన చైతన్య .. ఇలా రాసుకొచ్చాడు. నేను ఇక్కడికి వచ్చేలా చేసిన వారందరికీ చాలా థాంక్స్. మనం ఎక్కడికైనా ఎలాంటి ఆలోచనలు లేకుండా వెళ్తే.. అద్భుతమైన జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇది కూడా అలాంటిదే’ అని రాసుకొచ్చాడు చైతన్య. అయితే చైతన్య జొన్నలగడ్డ ఇలా ఎమోషనల్ పోస్ట్ చేయడానికి కారణం ఏంటి బ్రో.? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram