నిధికి కళ్లు చెదిరే ఫాలోయింగ్
నిధి అగర్వాల్...ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ల మనుసుల్లో హాయి కలుగుతుంది. ఆమె తన అందాలతో ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది మరి.
నిధి అగర్వాల్…ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ల మనుసుల్లో హాయి కలుగుతుంది. ఆమె తన అందాలతో ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది మరి. 2018లో నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటి. బెంగళూరుకు చెందిన ఈ భామ చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం తెలుగులో వరస అవకాశాలు దక్కించుకుంది. గత ఏడాది పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో నిధికి ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.
సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ పోస్ట్ చేసే నిధి అగర్వాల్‌కు ఫేస్ బుక్‌లో ఫాలోవర్స్ సంఖ్య 8.5 మిలియన్ల మార్క్ దాటింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 5.4 మిలియన్లకు పైగా ఈ భామను ఫాలో అవుతున్నారు. ఇక ట్విట్టర్ పేజీలో అర మిలియన్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంటే మొత్తం సోషల్ మీడియా ఖాతాలను కలిపి14.5 మిలియన్ల మంది ఫాలోవర్లను ఈ అమ్మడు కలిగి ఉంది. ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ ‘జేమ్’ అనే కన్నడ చిత్రంతో పాటు.. జయం రవి హీరోగా తెరకెక్కుతున్న ‘భూమి’ మూవీస్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కూడా ఓ సినిమా సైన్ చేసింది.
Also Read :
తనతో ఆడుకున్న చిన్నారి మృతదేహం జాడచూపిన పెంపుడు కుక్క