సుశాంత్ మరణం తరువాత భయమేసింది: నటుడు అంగద్
నటుడిగా ఓ వెలుగు వెలుగొందుతోన్న సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం చాలా మందిని కదిలించింది
Angad on Sushant death: నటుడిగా ఓ వెలుగు వెలుగొందుతోన్న సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం చాలా మందిని కదిలించింది. సొంత టాలెంట్‌గా మంచి హీరోగా ఎదిగిన సుశాంత్ ఇలా చేసి ఉండకూడదంటూ ఫ్యాన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు తమ అభిప్రాయలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదని సుశాంత్‌ని ఎవరో హత్య చేశారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సుశాంత్ కుటుంబం న్యాయ పోరాటానికి సిద్ధం కాగా.. పలువురి నుంచి వారికి మద్దతు లభిస్తోంది.
ఇదిలా ఉంటే సుశాంత్ ఆత్మహత్య తరువాత ఇండస్ట్రీని వదిలేసినట్లు అనిపించిందని నటుడు, సుశాంత్ జిమ్ ఫ్రెండ్ అంగద్ హసిజా అన్నారు. ”బుల్లి తెర నుంచి వెండి తెర వరకు సుశాంత్ ప్రయాణం ప్రశంసించదగినది. ప్రతి ఒక్కరు తన గురించి మాట్లాడుకునే స్థాయికి సుశాంత్ ఎదిగాడు. కానీ ఆయన మరణించాడన్న వార్త నన్ను చాలా బాధించింది. ఇండస్ట్రీని వదిలేసినట్లుగా అనిపించింది” అని తెలిపారు.
ఇక సుశాంత్ డిప్రెషన్‌కి గురయ్యాడన్న విషయాన్ని తాను నమ్మలేనని, ఇండస్ట్రీనే అతడిని చాలా బాధకు గురి చేసి ఉంటుందని తనకు అనిపించిందని అంగద్ వెల్లడించారు. ”నేను బాలీవుడ్‌లోకి వెళ్లాలని ఎలాంటి ఆశలు పెట్టుకోలేను. ఈ ఘటన తరువాత చాలా భయపడ్డాను. దీని వలన తిరిగి షూటింగ్‌కి వెళ్లడానికి కూడా చాలా సమయం పట్టింది” అని ఆయన పేర్కొన్నారు. ఇక సుశాంత్‌తో తాను ఫోన్‌లో కాంటాక్ట్ లేకపోయినా కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడేవాడని, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడని అంగద్ వివరించారు.
Read More:
పారికర్ తనయుడికి కరోనా.. ఆసుపత్రిలో చేరిన బీజేపీ నేత
నాని ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. రెడీ అవుతోన్న ‘వి’ ట్రైలర్!