AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerwal : ఇలా ఉన్నారేంట్రా.. హీరోయిన్‏ నిధి అగర్వాల్‏కు చేదు అనుభవం.. సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్..

సాధారణంగా హీరోహీరోయిన్లలు పలు ఈవెంట్లలో ఎదురయ్యే పరిస్థితుల గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కథానాయికల విషయం మరీ దారుణంగా ఉంటుంది. ఇదివరకు ఎంతో మంది తారలు పబ్లిక్ ఈవెంట్స్, సినిమా ప్రమోషన్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా రాజాసాబ్ బ్యూటీకి సైతం చేదు అనుభవం ఎదురైంది.

Nidhhi Agerwal : ఇలా ఉన్నారేంట్రా.. హీరోయిన్‏ నిధి అగర్వాల్‏కు చేదు అనుభవం.. సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్..
Nidhhi Agerwal
Rajitha Chanti
|

Updated on: Dec 18, 2025 | 1:26 PM

Share

అభిమానం హద్దులు దాటితే.. ఫ్యాన్స్‌ను చూస్తేనే భయపడే పరిస్థితి వస్తే.. నిన్న హీరోయిన్‌ నిధి అగర్వాల్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ గుంపు నుంచి ఎలాగోలా బయటపడి కారెక్కేవరకూ ఎంత భయపడిందో ఆమె ఫేస్‌ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. నిన్న రాజాసాబ్ సినిమాలోని 2వ సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. సహనా పాట‌ను KPHBలోని ఓ మాల్‌లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ను ఫ్యాన్స్‌ ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఈవెంట్‌ తర్వాత బయటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వకుండా అంతా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. కారు దగ్గరకు వెళ్లేందుకు కూడా ఛాన్స్‌ లేనంతగా తోపులాట మొదలైంది. ఎట్టకేలకు సెక్యూరిటీ సాయంతో అక్కడి నుంచి బయటపడింది నిధి అగర్వాల్‌. బయటకు వస్తున్నప్పుడు, కార్‌ ఎక్కిన తర్వాత నిధి ఫేస్ చూస్తే ఎంతగా భయపడిందో.. ఫ్యాన్స్‌ అతికి ఎంతగా వణికిపోయిందో క్లియర్‌గా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..

అంతా తోసుకుంటూ మీద పడిపోతుండడంతో జనాల్ని కంట్రోల్‌ చేయడం, నిధిని బయటకు తీసుకురావడం ఓ మినీ యుద్ధం చేసినట్టుగా ఉంది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది రాజాసాబ్.. ప్రభాస్‌ హీరోగా మారుతీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన డ్యూయట్‌ని నిన్న రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌ కోసం వచ్చిన నిధి అగర్వాల్‌కి ఫ్యాన్స్‌ ఇలా నరకం చూపించారు.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

చివరగా హరి హర వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన నిధి.. ఇప్పుడు రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్ , రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

వారణాసి సినిమాలో మరో స్టార్! జక్కన్న వేరే లెవెల్ ప్లాన్
వారణాసి సినిమాలో మరో స్టార్! జక్కన్న వేరే లెవెల్ ప్లాన్
చావు అంచుల వరకు వెళ్లి.. ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన కోహ్లీ దోస్త్
చావు అంచుల వరకు వెళ్లి.. ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన కోహ్లీ దోస్త్
రామ్‌ చరణ్ గొప్ప వ్యక్తే కానీ.. నా ఫేవరెట్ మాత్రం ఆ హీరోనే
రామ్‌ చరణ్ గొప్ప వ్యక్తే కానీ.. నా ఫేవరెట్ మాత్రం ఆ హీరోనే
వారెవ్వా.. మెదడు వయస్సును తగ్గించుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
వారెవ్వా.. మెదడు వయస్సును తగ్గించుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
108 అడుగుల జాంభవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా.?
108 అడుగుల జాంభవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా.?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
OTTలోకి స్ట్రీమింగ్‌కు రాపో సినిమా.. డేట్ ఫిక్స్
OTTలోకి స్ట్రీమింగ్‌కు రాపో సినిమా.. డేట్ ఫిక్స్
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!
నా రికార్డునే బ్రేక్ చేస్తావా? లైవ్‌లో మెక్‌గ్రాత్ ఏం చేశాడంటే?
నా రికార్డునే బ్రేక్ చేస్తావా? లైవ్‌లో మెక్‌గ్రాత్ ఏం చేశాడంటే?
హైదరాబాద్‌లో ఒక్కసారిగా అలజడి.. కేవలం 10 రోజుల్లోనే..
హైదరాబాద్‌లో ఒక్కసారిగా అలజడి.. కేవలం 10 రోజుల్లోనే..