Nidhhi Agerwal: మరీ చీప్‏గా ప్రవర్తించకండి.. నెటిజన్‏లపై ఇస్మార్ట్ బ్యూటీ ఫైర్..

"ఇస్మార్ట్ శంకర్" సినిమాతో తెలుగు కుర్రకారుకు కళల రాకుమారిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత నిధి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్‏లను అందుకుంటూ

Nidhhi Agerwal: మరీ చీప్‏గా ప్రవర్తించకండి.. నెటిజన్‏లపై ఇస్మార్ట్ బ్యూటీ ఫైర్..
Nidhhi Agerwal
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 16, 2021 | 2:47 PM

“ఇస్మార్ట్ శంకర్” సినిమాతో తెలుగు కుర్రకారుకు కళల రాకుమారిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత నిధి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్‏లను అందుకుంటూ టాప్ హీరోయిన్స్‏తో పోటీ పడుతుంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “హరిహర వీరమల్లు” సినిమాలో నటిస్తోంది. అయితే నిధికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తన వ్యక్తిగత వివరాలతోపాటు.. ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ.. ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా.. ఎప్పుడూ ఏదో మ్యాటర్ పై పోస్టులు పెడుతూ.. వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు నెటిజన్‏పై ఫైర్ అయ్యింది. అయితే తాజాగా నిధి అగర్వాల్ ఓ విషయం మీద బాగానే సీరియస్ అయ్యారు. అది కచ్చితంగా ఈ ఫోటోనే, ఈ విషయం మీదే అని తెలియడం లేదు. . తన ఫోటోలను మితిమీరి వాడుకుంటున్నారంటూ సీరియస్ అయ్యింది.

Nidhi

ఈ మేరకు తన ఇన్‏స్టా స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది నిధి. అందులో.. నాకు సంబంధించిన ఈ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యూలేట్ అవుతూనే ఉంది. వాస్తవానికి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైన సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే వాటిని షేర్ చేయకండి. అది అనవరం. అవి చీప్ పనులు. ఈ పనులతో మీరు మరింత దిగజారకండి అంటూ నిధి అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్వీట్..

Also Read: Amala Paul: జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఇప్పుడు వాటిని వేరు చేసి వెళుతున్నా. అమలా ఆసక్తికర వ్యాఖ్యలు.

Sameera Reddy: బరువు తగ్గేందుకు సమీరా ఏం చేస్తుందో చూడండి.! చిన్నారులతో కలిసి వర్షం సైతం లెక్క చేయకుండా.

Sameera Reddy: బరువు తగ్గేందుకు సమీరా ఏం చేస్తుందో చూడండి.! చిన్నారులతో కలిసి వర్షం సైతం లెక్క చేయకుండా.

Karthika Deepam: రోషిణిని అనుమానిస్తున్న మోనిత.. కార్తీక్‌ని పెళ్లి చేసుకోవడానికి సరికొత్త ప్లాన్‌తో రెడీ