AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amala Paul: జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఇప్పుడు వాటిని వేరు చేసి వెళుతున్నా. అమలా ఆసక్తికర వ్యాఖ్యలు.

Amala Paul: 2009లో తమిళ చిత్రం 'నీలతమర' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు నటి అమలాపాల్‌. ఈ సినిమాలో డీగ్లామర్‌ పాత్రలో కనిపించి తొలి సినిమాతోనే...

Amala Paul: జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఇప్పుడు వాటిని వేరు చేసి వెళుతున్నా. అమలా ఆసక్తికర వ్యాఖ్యలు.
Amala Paul
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 16, 2021 | 1:52 PM

Share

Amala Paul: 2009లో మలయాళం చిత్రం ‘నీల తామర’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు నటి అమలాపాల్‌. ఈ సినిమాలో బీనా అనే స్టూడెంట్ పాత్రలో కనిపించి తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేశారు. ఇక వరుస సినిమాలతో బిజీగా మారిన ఈ చిన్నది నాగ చైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితం విషయంలోనూ అమలా నిత్యం వార్తల్లో ఉంటారు. గతంలో దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ను వివాహం చేసుకున్న అమలాపాల్‌ అనంతరం కొన్ని కారణాల వల్ల అతని నుంచి విడిపోయారు. ఇక ఇటీవల అమలా మరో వివాహం చేసుకుందని, వాటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే దీనిపై అమాలా స్పందించలేరు. ఇక తాజాగా కెరీర్‌ దృష్టి పెట్టిన ఈ భామ వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు ఓకే చెబుతూ దూసుకెళుతున్నారు. ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలైన ‘కుడి ఎడమైతే’తో ఇటీవల డిజిటల్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అమలా. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

17 ఏళ్ల ప్రాయంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని చెప్పిన అమలా.. రీల్‌ లైఫ్‌లో ఎదుర్కొన్న చాలా విషయాలను రియల్‌ లైఫ్‌లోనూ అనుభవించానని చెప్పుకొచ్చారు. ‘వాటిని ఎలా వేరు చేయాలో ఆ సమయంలో తెలియలేదు. ఇక 2020లో నాన్న చనిపోయారు.. ఆ సమయంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలోనే నా కష్టాలను ఓసారి గుర్తుచేసుకున్నాను. నాకంటూ ప్రత్యేకమైన జీవితం ఏది లేదని గ్రహించాను. కష్టాలు వచ్చిన సమయంలో నా జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు నేను నేనుగా జీవిస్తున్నాను. సినీ జీవితాన్ని, నిజ జీవితాన్ని వేరు చేసి ముందుకు సాగుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు అమలా. ఇక తన సినిమా ఎంపికలో కూడా మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు అమలా.. ఈ క్రమంలోనే పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Also Read: Tirumal Hundi: తిరుమల శ్రీవారి హుండీలో పాకిస్తానీ కరెన్సీ.. ఆశ్చర్యపోయిన అధికారులు..

Amazon Jobs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు.. కొత్తగా 11 ఫుల్‌ ఫిల్మెంట్‌ కేంద్రాలు..పూర్తి వివరాలివే..!

Sharmila: తెలంగాణ నీరు చుక్క కూడా వదులుకోం.. జగన్, కెసిఆర్ ఇద్దరూ ఫ్రెండ్సే.. ప్రభంజనం సృష్టిస్తా.. రాసి పెట్టుకోండి : షర్మిల

Follow Us
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు