అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అయితే ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లో అనుకోకుండా సడెన్ గా ఒక క్యారెక్టర్ ఎంటరవుతుంది. ఇదే పార్ట్ 3కి కూడా కారణమవుతోంది. మరి పుష్ప 2 కు క్లైమాక్స్ లో అదరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆ పర్సన్ ఎవరన్న దానిపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. చాలామంది టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ అని అంటున్నారు. అదే సమయంలో పుష్ప 1, 2 సినిమాల్లో కీలక పాత్ర పోషించిన ఫహాద్ ఫాజిల్ మళ్లీ బతికి వచ్చాడంటున్నారు. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప రాజ్, శ్రీవల్లి ఓ వివాహ వేడుకలో ఉంటారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో అక్కడ ఒక భారీ బాంబు పేలుడు వినిపిస్తుంది. కట్ చేస్తే.. స్క్రీన్ పై రిమోట్ పట్టుకుని ఒక అజ్ఞాత వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. సినిమా స్క్రీన్‌పై అతని ముఖం కనిపించదు. ఈ క్రమంలోనే తమకు తోచిన విధంగా ఊహించుకుంటున్నారు. క్లైమాక్స్ లో పుష్ప రాజ్ ను చంపేందుకు పన్నాగం వేసింది మరెవరో కాదు ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ ( ఫహాద్ ఫాజిల్) అని అంటున్నారు.
కాగా పుష్ప రాజ్ ను ఎదుర్కొనే క్రమంలో అతను ఎదురు దెబ్బలు తింటాడు షెకావత్. అవమానాలు కూడా పడతాడు. చివరకు అతను ఓ అగ్ని ప్రమాదంలో చనిపోయినట్లు చూపిస్తారు. అయితే ఈ ఘటనలో షెకావత్ చనిపోలేదని, పుష్ప రాజ్ పై ప్రతీకారం తీర్చుకునేదుకు మళ్లీ బతికొస్తాడంటున్నారు నెటిజన్స్. ఇందుకు కొన్ని సాక్యాలు కూడా చూపిస్తున్నారు. క్లైమాక్స్ లో కనిపించే వ్యక్తి చేయి చాలా సన్నగా ఉంటుంది. అలాగే చేతులపై కాలిన గాయాలుంటాయి. అంటే షెకావతే మళ్లీ పుష్ప రాజ్ ఫ్యామిలీని మట్టు బెట్టేందుకు ప్రయత్నించాడని అంచనా వేస్తున్నారు. ఇది పార్ట్ 3 పుష్ప ర్యాంపేజ్ లో తెలుస్తుందంటున్నారు. కాగా ‘పుష్ప 3’ షూటింగ్ ప్రారంభం కావడానికి కనీసం రెండు మూడేళ్లు పడుతుందని అంటున్నారు. అలాగే ఇందులో విజయ్ దేవరకొండ విలన్ గా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే.
A HISTORIC SINGLE DAY in Hindi ❤️🔥#Pushpa2TheRule collects a Nett of 86 CRORES on Day 4 – creating an all time record of the HIGHEST Hindi collection in a single day 🔥
The Wildfire Blockbuster also becomes the fastest Hindi film to reach 291 CRORES NETT in just 4 days 💥💥… pic.twitter.com/Jarw91cHNk
— Pushpa (@PushpaMovie) December 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.