Cinema : విడుదలకు ముందే రచ్చ రచ్చ చేస్తున్న సినిమా.. ట్రైలర్ పై మండిపడుతున్న నెటిజన్స్.. అసలు ఏం జరిగిందంటే..

రిలీజ్‌కు ముందే రచ్చ రచ్చ చేస్తున్న సినిమా గురించి మీకు తెలుసా.. ? ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ మూవీ పేరు మారుమోగుతుంది. ఫిబ్రవరి 27న ఆ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈసారి మౌనం కాదు, పోరాటం అంటూ ఇటీవల ట్రైలర్‌ విడుదల చేశారు. అయితే ఆ ట్రైలర్ చూసి నెటిజన్స్ మండిపడుతున్నారు.

Cinema : విడుదలకు ముందే రచ్చ రచ్చ చేస్తున్న సినిమా.. ట్రైలర్ పై మండిపడుతున్న నెటిజన్స్.. అసలు ఏం జరిగిందంటే..
The Kerala Story 2

Updated on: Feb 18, 2026 | 1:41 PM

ద కేరళ స్టోరీ-2 మూవీపై తీవ్ర దుమారం రేగుతోంది. ట్రైలర్ ఓపెనింగే, ఒక వివాదాస్పద డైలాగ్‌తో అందరినీ టెన్షన్ పెట్టించాడు దర్శకుడు. రాబోయే పాతికేళ్లలో షరియా చట్టాలను అమలు చేసే ఇస్లామిక్ స్టేట్‌గా భారత్ మారుతుందంటూ ట్రైలర్‌లో చెప్పడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈసారి స్టోరీ కేరళకే పరిమితం కాలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ పల్లెలను టచ్ చేసింది. తొలిభాగం తరహాలోనే మతమార్పిడి అంశం చుట్టూనే కథాంశం నడుస్తోంది. కానీ ఈసారి మరింత డోస్ పెంచినట్లు ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది..

ఎక్కువ మంది చదివినవి :  Actress Prathyusha : స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్స్‏లో సూసైడ్.. హీరోయిన్ ప్రత్యూష ఎలా చనిపోయిం

ట్రైలర్ రిలీజ్‌ అయిన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. ఈసారి మౌనం కాదు, పోరాటం అంటూ ముగ్గురు యువతుల చుట్టూ కథనడిపించినట్లు తెలుస్తోంది. తొలిభాగంలో ఆదాశర్మ లీడ్ రోల్ పోషించింది. అయితే రెండో భాగంలో ఆదాశర్మకు బదులు ఉల్కా గుప్తా, ఆదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు యువతుల కథల ద్వారా సమస్యను జాతీయ స్థాయిలో చూపించాలన్నదే తమ ఉద్దేశ్యం అంటున్నారు మేకర్స్ .

ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

మొదటి చిత్రం The Kerala Story విడుదలకు ముందే, న్యాయపరంగా , రాజకీయంగా ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. నిషేధం కోరుతూ పలు పిటిషన్లు దాఖలైన, చివరకు కొన్ని కట్స్‌తో సుప్రీంకోర్టు అనుమతించింది. మరి అంతకుమించిన వివాదంతో వస్తున్న రెండోభాగం ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి..

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

Follow Us