Hero Nani: వెయిటింగ్ లిస్ట్.. నాని కావాలంటున్న ఆ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ..!

| Edited By: Rajeev Rayala

Jan 07, 2024 | 9:36 PM

ముందు ప్రేక్షకుడిగా ఓ కథ విని ఫైనల్ చేసిన తర్వాతే.. హీరోగా ఆలోచిస్తుంటాడు నాచురల్ స్టార్. అందుకే ఈయనకు కథ చెప్పి ఒప్పించడం అనేది చిన్న విషయం కాదు. దర్శకులకు కూడా తమ కథ నాని ఓకే చేసాడంటే హిట్ అనే నమ్ముతుంటారు. అందుకే ఈ జనరేషన్ హీరోలలో ఎవరికీ లేనంత సక్సెస్ రేట్ నానికే ఉంది. ఎక్కడో ఒకట్రెండు సినిమాలు లెక్క తప్పుతుంటాయి కానీ మ్యాగ్జిమమ్ నాని సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బాగానే ఫెయిర్ చేస్తుంటాయి.

Hero Nani: వెయిటింగ్ లిస్ట్.. నాని కావాలంటున్న ఆ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ..!
Nani
Follow us on

నాని ఓ సినిమా ఓకే చేయాలంటే మామూలు విషయం కాదు.. ఆయన కథ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా చాలా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. రేపు షూటింగ్ మొదలవుతుంది అనగా కూడా తన డౌట్స్ క్లియర్ చేయాలని కోరే నటుడు నాని. పైగా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాడు కాబట్టి ఈయనకు క్లారిటీ కూడా బాగానే ఉంటుంది. ముందు ప్రేక్షకుడిగా ఓ కథ విని ఫైనల్ చేసిన తర్వాతే.. హీరోగా ఆలోచిస్తుంటాడు నాచురల్ స్టార్. అందుకే ఈయనకు కథ చెప్పి ఒప్పించడం అనేది చిన్న విషయం కాదు. దర్శకులకు కూడా తమ కథ నాని ఓకే చేసాడంటే హిట్ అనే నమ్ముతుంటారు. అందుకే ఈ జనరేషన్ హీరోలలో ఎవరికీ లేనంత సక్సెస్ రేట్ నానికే ఉంది. ఎక్కడో ఒకట్రెండు సినిమాలు లెక్క తప్పుతుంటాయి కానీ మ్యాగ్జిమమ్ నాని సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బాగానే ఫెయిర్ చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఆయనకు హీరోగా మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత నాని నుంచి వచ్చిన ఫ్లాప్ సినిమాలు చాలా తక్కువ.

ఎక్కడో కృష్ణార్జున యుద్ధం, గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికి లాంటి సినిమాలు మినహాయిస్తే.. దాదాపు అన్నీ సక్సెస్ అయినవే. ఫ్లాప్ అయిన వాటిలోనూ గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఆయా టైమ్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా అవి ఫ్లాప్ అయ్యాయంతే. గతేడాది కూడా దసరా, హాయ్ నాన్న లాంటి సినిమాలు కొత్త దర్శకులతో చేసి హిట్లు కొట్టాడు నాని. ఏడాదిలో ఒక్కసారి కొత్త దర్శకుడిని నమ్మడానికే హీరోలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు కానీ నాని మాత్రం ఒకే ఏడాది ఇద్దరు న్యూ డైరెక్టర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు వాళ్ల నుంచి పర్ఫెక్ట్ ఔట్ పుట్ తీసుకున్నాడు. ఇప్పుడు తనకు గతంలో ఫ్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయతోనే సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు.

ఇంత గట్స్ ఉన్న హీరో మన దగ్గర ఉండటం అరుదు. నాని మాత్రం కథ నచ్చితే ట్రాక్ రికార్డ్ చూడడు.. అనుభవం ఉందా లేదా అనేది చూడడు.. ఓ షో రీల్ చేసుకుని రమ్మంటాడు.. అది నచ్చితే లెట్స్ మీట్ ఆన్ సెట్స్ అంటాడంతే. అందుకే నానితో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు దర్శకులు. అయితే హాయ్ నాన్న తర్వాత మూడు నాలుగు సినిమాలకు నో చెప్పాడీయన. టిజి జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమాలో నానిని ఓ ముఖ్య పాత్ర కోసం అడిగారు.. అయితే దానికి సున్నితంగా నో చెప్పాడు నాని. అదే రోల్ ఇప్పుడు రానా దగ్గుబాటి చేస్తున్నాడు. మరోవైపు శివకార్తికేయన్‌తో డాన్ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ శిబి చక్రవర్తి సినిమా కూడా దాదాపు ఫైనల్ అయిపోయింది. అయితే బడ్జెట్ దగ్గర ఇష్యూస్ రావడంతో నో చెప్పేసాడు నాని.

తన వాల్ పోస్టర్ బ్యానర్‌లోనే శైలేష్ కొలనుతో హిట్ 3 చేయాలనుకున్నా.. ఇప్పుడు కాదు.. మరో రెండేళ్లైన తర్వాత ఆ ప్రాజెక్ట్ చేస్తామంటున్నారు ఇద్దరూ. మార్చ్‌లోపు సరిపోదా శనివారం పూర్తైపోతుంది. ఈ లోపు బలగం ఫేమ్ వేణు ఈ మధ్యే నానికి ఓ కథ చెప్పాడు. లైన్ కూడా నానికి నచ్చింది. అయితే ఫుల్ నెరేషన్ ఇచ్చిన తర్వాత నాని నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు. గతంలో నానితో నేను లోకల్, ఎంసిఏ లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చాడు దిల్ రాజు. వి ఫ్లాప్ అయినా అది ఓటిటి కాబట్టి లెక్కలు తెలియదు. వేణు కథ వర్కవుట్ అయితే నాని చేయబోయే నెక్ట్స్ సినిమా ఇదే అవుతుంది. ఇది కూడా బలగం మాదిరే ఎమోషనల్ సబ్జెక్ట్ అని తెలుస్తుంది. మరి చూడాలిక.. నాని ఈ సినిమాకు ఓకే అంటాడో లేదో..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.