టాలీవుడ్‌లో నూతన దర్శకులు కొత్త కథలతో దూసుకుపోతున్నారు. ప్రేక్షకుల మనసుకు హత్తుకునే కథలను తెరకెక్కిస్తున్న మంచి సినిమా చూశాం అనే ఫీల్ ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య. అతని కోరిక నెరవేరిందా లేదా అనే ఆసక్తిని కలిగిస్తూ సాగింది “ముత్తయ్య” సినిమా టీజర్. ఈ టీజర్ ను నేచురల్ స్టార్(Natural Star Nani )నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. నాకు 24 ఏళ్ల వయసులో “అష్టా చమ్మా” సినిమాలో అవకాశం రాకుంటే 70 ఏళ్లకు నేనూ ముత్తయ్యలాగే అయ్యేవాడిని. టీజర్ మనసుకు హత్తుకుంది అని అన్నారు నేచురల్ స్టార్. టీజర్ చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించి, చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ అంటూ విశెస్ చెప్పారు.
కె సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ముత్తయ్య సినిమాను హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు బ్యానర్స్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పణలో వ్రిందా ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించిందీ చిత్రం. మే 9న లండన్ లోని రిచ్ మిక్స్ లో ప్రీమియర్ కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :