Natural Star Nani: నేచురల్ స్టార్ నాని తొలి సినిమాకు అందుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే

|

Sep 07, 2022 | 8:26 AM

నేచురల్ స్టార్ నాని.. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేశాడు ఈ టాలెంటెడ్ హీరో.

Natural Star Nani: నేచురల్ స్టార్ నాని తొలి సినిమాకు అందుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
Natural Star Nani Ashta Cha
Follow us on

నేచురల్ స్టార్ నాని(Natural Star Nani).. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేశాడు ఈ టాలెంటెడ్ హీరో. రాఘవేంద్ర రావు, బాపు లాంటి లెజెండ్స్ దగ్గర నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇక అష్టాచమ్మా సినిమాతో నాని హీరోగా పరిచయం అయ్యాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. అలాగే అవసరాల శ్రీనివాస్ మరో హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాని నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నానికి అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత వచ్చిన  అలా మొదలైంది సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయాడు నాని.

నాని తన మొదటి సినిమాను అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన నాని అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అష్టాచమ్మా సినిమాకు క్లాప్ , అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ కు పెద్దగా రెమ్యునరేషన్ ఉండదు. పని నేర్పించి , భోజనం పెడతారు అంతే.. అలాగే నానికి కూడా అష్టాచమ్మా సినిమాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదట.. ప్రస్తుతం నాని రెమ్యునరేషన్ 8 కోట్లు అందుకుంటున్నారు. ఇక ఇటీవలే నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు దసరా అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి