Naresh-Pavitra Lokesh: పెళ్లి తర్వాత దుబాయ్‌కు వెళ్లిన నరేష్‌- పవిత్ర.. హనీమూన్‌ అక్కడే! ఫొటోలు వైరల్‌

|

Mar 10, 2023 | 4:13 PM

పెళ్లి తర్వాత నరేశ్‌- పవిత్ర హనీమూన్‌ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ దుబాయ్‌ వీధుల్లో ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Naresh-Pavitra Lokesh: పెళ్లి తర్వాత దుబాయ్‌కు వెళ్లిన నరేష్‌- పవిత్ర.. హనీమూన్‌ అక్కడే! ఫొటోలు వైరల్‌
Naresh, Pavitra Lokesh
Follow us on

గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంటోన్న ప్రముఖ సినీనటులు నరేష్‌-పవిత్రా లోకేశ్‌లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇవాళ (మార్చి10) మైసూరు వేదికగా వీరి వివాహం జరిగింది. కేవలం అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో నరేష్‌- పవిత్ర మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. దీనికి సంబంధించి పెళ్లి వీడియోను నరేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు, మీ పవిత్రా నరేశ్‌’ అని తన పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చాడు నరేశ్‌. అతను అలా షేర్‌ చేశాడో లేదో ఒక్కసారిగా ఈ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే నరేశ్‌కు నాలుగో పెళ్లి కాగా పవిత్ర లోకేశ్‌కు రెండో పెళ్లి కావడం గమనార్హం. కాగా పెళ్లి తర్వాత నరేశ్‌- పవిత్ర హనీమూన్‌ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ దుబాయ్‌ వీధుల్లో ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.

కాగా ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా రాణిస్తోన్నారు నరేశ్‌- పవిత్ర. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది క్రమంగా ప్రేమగా చిగురించింది. ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టారు. అయితే నరేశ్‌ మూడో సతీమణి రమ్యా రఘుపతి మాత్రం నరేశ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. నరేశ్‌- పవిత్రల పెళ్లి జరగనిచ్చేది లేదని, నరేశ్‌కు విడాకులు ఇచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పేసింది. మరోవైపు సోషల్‌ మీడియాలో నరేశ్‌- పవిత్రల బంధంపై ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. దీనిపై ఇప్పటికే చాలాసార్లు పోలీసులను ఆశ్రయించాడు నరేశ్‌. అయితే గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకుని షాకిచ్చారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.