Trending Song : యూట్యూబ్‌లో ఈ సాంగ్ విధ్వంసం.. 100 మిలియన్ వ్యూస్‌తో గత్తరలేపుతున్న మాస్ పాట..
ఇటీవల యూట్యూబ్ లో కొన్ని పాటలు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఫోక్ సాంగ్స్ సృష్టిస్తున్న తుఫాను గురించి చెప్పక్కర్లేదు. తాజాగా ఓ సినిమా సాంగ్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ పాట తాజాగా యూట్యూబ్‌లో 100 మిలియన్ల (10 కోట్లు) వ్యూస్ మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ప్రస్తుతం యూట్యూబ్ లో ఓ సినిమా సాంగ్ ప్రభంజనం సృష్టిస్తుంది. ఆ పాటలోని మాస్ బీట్ జనాలను ఊర్రూతలూగిస్తుంది. సాధారణంగా ఒక సినిమా పాట ఇంతటి భారీ స్థాయిలో వ్యూస్ సాధించడమనేది ఆ చిత్రంపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటివరకు ఆ పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఆ సాంగ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. అదే ఆయా షేర్. న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా నుంచి విడుదలైన ఈ మాస్ సాంగ్.. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలోని ఎనర్జిటిక్ బీట్స్, క్యాచీ లిరిక్స్ , హీరో పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ పాటకు ఫిదా అయిపోయారు.
ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..
కేవలం యూట్యూబ్‌లోనే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, మోజ్ మరియు ఇతర షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా “ఆయా షేర్” సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. వేల సంఖ్యలో నెటిజన్లు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు అందించిన మాస్ ట్యూన్, గాయకుల ఎనర్జీ ఈ పాట సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. తమ పాట 100 మిలియన్ల వ్యూస్ సాధించడం పట్ల చిత్ర బృందం అమితానందం వ్యక్తం చేస్తోంది. ఈ ఘనత సాధించడానికి కారణమైన ప్రేక్షకులకు, అభిమానులకు వారు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ పాట సాధించిన విజయం మూవీ హైప్‌ను మరింత పెంచింది.
ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..
పాట ఇంత పెద్ద హిట్ కావడంతో, సినిమా మేకింగ్, కథాంశంపై సినీ ప్రియులలో ఆసక్తి నెలకొంది. ‘ద ప్యారడైజ్’ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక చిన్న స్పార్క్ లా మొదలైన ఈ పాట, ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ సినిమా రేంజ్‌ను మార్చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‌తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..
