Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ప్రియాడికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. కలకత్తా నేపథ్యంలో 70వ దశకానికి చెందిన కథకావడంతో నాని ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో పాటలు, టీజర్, ట్రైలర్ తో సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సిరివెన్నెల రెండు పాటలు రచించారు. అందులో ఆయన రాసిన చివరి సాంగ్ సిరివెన్నెల పాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ పాట లో సిరివెన్నెల అందమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాట లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీతం .. సాహిత్యం అందంగా కుదిరిన ఈ పాట విజువల్ పరంగాను చూడముచ్చటగా ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా విజయం పై ముందునుంచి ధీమాగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక సినిమా విడుదల తర్వత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :