Shyam Singha Roy : నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే

|

Dec 10, 2021 | 6:10 PM

 Shyam Singha Roy: న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది.

Shyam Singha Roy : నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే
Ssr
Follow us on

Shyam Singha Roy: న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.

ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఇక టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించింది. ఇక విడుదల దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన ఈ పాటల్లో సిరివెన్నెల చివరి పాట విశేష స్పందన దక్కించుకుంది. అద్భుతమైన సాహిత్యంతో మరోసారి ఆకట్టుకున్నారు సిరివెన్నెల. ఈ క్రమంలోనే శ్యామ్ సింగ రాయ్ రాయల్ ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వరంగల్‌లోని రంగలీల మైదానంలో ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతోన్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

‘Spider-Man’ No Way Home : స్పైడర్ మాన్ దెబ్బకు అట్టుడికిన వెబ్ సైట్లు.. అసలేం జరిగిందంటే..

సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన హీరోయిన్.. ఆమెను అలా చూసి అందరూ షాక్

RRR Trailer: కుంభస్థలం పైనే కన్నేసిన ‘ఆర్ఆర్ఆర్’.. బద్దలు కొట్టడం ఖాయం.. ట్రైలర్‌కు రికార్డ్ వ్యూస్..