వాళ్లు కలిసినా.. కలవకపోయినా.. ఏదీ మారదు.! నెటిజన్ ప్రశ్నకు తారక రత్న భార్య స్ట్రాంగ్ కౌంటర్

నందమూరి తారకరత్న పేరు వినగానే కన్నీళ్లు వచ్చేస్తాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా 39ఏళ్లకే గుండెపోటుతో కన్నుమూశారు తారకరత్న. తన నటనతో హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నందమూరి హీరో తారకరత్న. నందమూరి ఫ్యామిలి నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

వాళ్లు కలిసినా.. కలవకపోయినా.. ఏదీ మారదు.! నెటిజన్ ప్రశ్నకు తారక రత్న భార్య స్ట్రాంగ్ కౌంటర్
Tarakaratna

Updated on: Sep 02, 2025 | 11:04 AM

నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకొని.. ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు నందమూరి తారకరత్న. నందమూరి తారకరత్న 2023 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఆయన మరణం నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ అభిమానులు, టీడీపీ శ్రేణులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న.. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారు. తారకరత్నమరణంతో ఆయన భార్య అలేఖ్య ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తరచూ తన భర్త గురించి ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తుంటారు అలేఖ్య.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

తారకరత్న- అలేఖ్యరెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కూతురు పేరు నిష్క కాగా, కవల పిల్లలు తాన్యారామ్, రేయా. కాగా ఈ ముగ్గురి పిల్లలకు ఎన్టీఆర్‌ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అలేఖ్య తాజాగా అభిమానులతో చాట్ చేసింది. అందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అలేఖ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మిమ్మల్ని వాళ్లు కలుకుకోరు కదా ఎందుకు మీరు మా ఫ్యామిలీ అని అంటుంటారు.? అని ప్రశ్నించాడు.

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

దానికి అలేఖ్య సమాధానమిస్తూ.. ఎవరు మమ్మల్ని చూసినా.. చూడకపోయినా, మాట్లాడినా.. మాట్లాడకపోయినా, మమల్ని అంగీకరించినా.. అంగీకరించకపోయినా, కలిసినా.. కలవకపోయినా ఏదీ మారబోయేది లేదు. ఇది న కుటుంబం, మా కుటుంబం అని చెప్పుకొచ్చారు అలేఖ్య. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలేఖ్య వీడియో వైరల్ అవుతుండటంతో అభిమానులు ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

నందమూరి అలేఖ్య ఫేస్ బుక్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.