Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ అటు హీరోగా , ఇటు నిర్మాతగా రాణిస్తున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంటాడు కళ్యాణ్ రామ్. పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఆ రేంజ్ హిట్ ను అందుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు హిస్టారికల్ సినిమాతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాకు బింబిసార అనే టైటిల్ ను ఖరారు చేశారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు మోషన్ పోస్టర్ మినహా మారే అప్డేట్ రాలేదు. బింబిసార’ పూర్తి చారిత్రక చిత్రం కాదని తెలుస్తోంది. ఈ కథ టైమ్ ట్రావెల్ చుట్టూ నడుస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :