
అఖండ తాండవానికి మరో కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ గురువారం (డిసెంబర్ 04) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రేక్షకులకు మాత్రం శుక్రవారం (డిసెంబర్ 5) నుంచి థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది. ఈ మూవీలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా, జగపతి బాబు, ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, సాయి కుమార్, హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా అఖండ 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో బాలయ్యతో పాటు ఇతర క్యాస్టింగ్ రెమ్యునరేషన్ పై తీవ్ర చర్చ జరుగుతోంది.
సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తోన్న మరో సినిమా అఖండ 2 : తాండవం. వీరి కాంబోలో తెరకెక్కిన నాలుగో సినిమా ఇది. దీనికి తోడు అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ క్రేజీ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాను 200 కోట్ల కు పైగా బడ్జెట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు బాలయ్య కంటే బోయపాటి శ్రీనుకే ఎక్కువ రెమ్యునరేషన్ దక్కినట్టు తెలుస్తుంది. అఖండ 2 సినిమాకు బాలయ్య 25 నుంచి 30 కోట్ల వరకు తీసుకున్నాడంట. అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. అయితే, మొత్తంగా మాత్రం బాలయ్య కంటే బోయపాటికే ఎక్కువ అమౌంట్ చేతికి వచ్చిందని సమాచారం. ఇక్కడ ఒక కారణం ఉంది. అదేంటంటే.. బాలయ్య రెమ్యునరేషన్స్ తో పాటు ఈ సినిమా లాభాల్లో వచ్చే షేర్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. పైగా ఈ సినిమాను బాలయ్య కూతరు తేజస్వీ ప్రజెంట్ చేస్తున్నారు
AUM NAMA SHIVAYA 🔱🔥 !!
JAI AKHANDA 📈
THE ROAR IS
BIGGER MIGHTIER STRONGER
ALL SET FOR A TRANCE OF SHIVA 🔱🙌🏿💪🏾Get ready 🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🙏#Akhanda2Thaandavam 🔥🔫💣🔱 pic.twitter.com/lle8JGXlYP
— thaman S (@MusicThaman) December 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.