Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna: నర్సుల వివాదం పై స్పందించిన బాలయ్య.. పశ్చాతాపంతో కూడిన ప్రకటన

నోరు జారి బాలయ్య అనే వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవలే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యలు చేశారు బాలయ్య..

Nandamuri Balakrishna: నర్సుల వివాదం పై స్పందించిన బాలయ్య.. పశ్చాతాపంతో కూడిన ప్రకటన
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 06, 2023 | 1:26 PM

నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. నోరు జారి బాలయ్య అనే వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవలే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యలు చేశారు బాలయ్య. ఈ వ్యాఖ్యలపై అక్కినేని హీరోలు కూడా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అను అన్నారు. అంతకుముందు దేవాంగులకూ రావణబ్రహ్మకూ సంబంధముందంటూ.. వ్వాఖ్యానించారు బాలకృష్ణ. దీనిపై దేవబ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ విషయం తెలిసిన బాలయ్య వెంటనే రియాక్టయ్యారు. ఇది పొరబాటున దొర్లిన తప్పుగా చెప్పుకొస్తూ ఒక నోట్ రిలీజ్ చేశారు బాలకృష్ణ. దేవాంగుల్లో తనకు చాలా మంది అభిమానులుంటారనీ. తన వారిని తానెందుకు బాధ పెట్టుకుంటానని పశ్చాతాపంతో కూడిన ప్రకటన చేశారు.

ఇటీవల అన్ స్టాపబుల్ టాక్ షోలో నర్సుల గురించి కూడా ఒక కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లో నర్సు దాని.. యమా అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. దీని పై పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నర్సులను కించపరిచేలా బాలయ్య వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.

తాజాగా ఈ వివాదం పై బాలకృష్ణ స్పందించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ” అందరికి నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను… నా మాటలను కావాలనే వక్రీకరించారు రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ… మీ నందమూరి బాలకృష్ణ”