సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరుకారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన గారాలపట్టి సితారకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. మల్టీటాలెంటెడ్ సితార ఇటీవల ఓ ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ టైమ్ స్వ్కేర్ పై సితార యాడ్ ఫోటోస్ ప్రదర్శితమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ వైరలయ్యాయి. ఈ క్రమంలోనే సదరు జ్యూవెల్లరీ సంస్థ శనివారం హైదారాబాద్ లో ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు మహేష్ సతీమణి నమ్రత తన కూతురు సితారతో కలిసి హజరయ్యారు. ఈ కార్యక్రంలో నమ్రతా తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని సినీరంగ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గౌతమ్ లాంచింగ్ ఎప్పుడూ అంటూ విలేకరులు ప్రశ్నించగా.. నమ్రతా స్పందిస్తూ.. “ప్రస్తుతం గౌతమ్ వయసు 16 ఏళ్లు. అతడికి ఇంకా టైమ్ పడుతుంది. ప్రస్తుతం తను గ్రాడ్యూయేషన్ పూర్తిచేయాలనుకుంటున్నాడు. తన దృష్టి మొత్తం చదువు మీదనే ఉంది. గౌతమ్ సినీ ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా ఏడెనిమిది సంవత్సరాలు పట్టొచ్చు. ” అని అన్నారు. మొత్తానికి తొలిసారి మహేష్ వారసుడి సినీ ఎంట్రీపై నమ్రత స్పందించడంతో ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉందని అన్నారు సితార. జ్యువెల్లరీ సంస్థలో యాడ్ చేయడం చాలా సంతోషంగా ఉందని.. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో తన ఫోటోస్ ప్రదర్శించిన రోజు ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయని తెలిపింది. తన తండ్రిని పట్టుకుని భావోద్వేగానికి గురయ్యానని అన్నారు సితార.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.