Nagarjuna : రాత్రి పడుకునే ముందు ఆ ఒక్కటి తప్పకుండా తింటా.. లేదంట నిద్రపట్టదు.. నాగార్జున..
నాగార్జున తన ఫిట్‌నెస్ వెనుక ఉన్న రహస్యాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నిజానికి ఆయన లుక్స్, ఫిట్నెస్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ట్రై చేస్తుంటారు. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు నాగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డైట్ గురించి చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున లుక్స్, ఫిట్నెస్ ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో ఇప్పటికీ ఆకట్టుకుంటారు. అయితే గతంలో నా సామి రంగా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ రహస్యాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి వివరించారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ మరోసారి వైరలవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో తన వృత్తికి ఫిట్‌నెస్ ఎంత అవసరమో ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కేవలం మన్మధుడు అనే బిరుదు కోసమో కాకుండా, తన పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
నాగార్జున తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ, తన శరీరాన్ని ఎప్పుడూ ఆహారం విషయంలో డిప్రైవ్ చేయనని స్పష్టం చేశారు. “కడుపు నిండా తింటానండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి” అని ఆయన తెలిపారు. తన రోజువారీ ఆహారంలో సమతుల్యత ఉండేలా చూసుకుంటానని, బ్రౌన్ రైస్, నెయ్యి, మూడు రకాల ఆకుకూరలు, చికెన్ లేదా ఫిష్, పెరుగు, తొక్కు పచ్చడి వంటివి తన భోజనంలో ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా, తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. రాత్రి భోజనం విషయానికి వస్తే, ప్రతిరోజూ సాయంత్రం ఏడు గంటలకల్లా డిన్నర్ పూర్తి చేసుకుంటానని, ఇది తన చాలా కాలంగా పాటిస్తున్న నియమమని పేర్కొన్నారు.
ఆహారంతో పాటు వ్యాయామం ప్రాముఖ్యతను కూడా నాగార్జున వివరించారు. ఉదయం పూట వర్కవుట్స్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం హైకి వెళ్తుందని, దీనివల్ల రోజంతా కేలరీలు బర్న్ అవుతూ ఉంటాయని ఆయన తెలిపారు. “మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటది, ఇలా కూర్చున్నప్పుడు కూడా” అని ఆయన అన్నారు. ఈ నియమాన్ని దాదాపు 35 సంవత్సరాలుగా పాటిస్తున్నానని, ఇదే తన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణమని నాగార్జున చెప్పారు. అంతేకాకుండా, తనదైన ఒక విచిత్రమైన అలవాటును కూడా పంచుకున్నారు. రాత్రి పడుకునే ముందు ఒక స్వీట్ తినకుండా తనకు నిద్రపట్టదని ఆయన సరదాగా చెప్పారు. “రోజు నేను సం స్వీట్ లేకుండా పడుకోలేను, నిద్రపట్టదు. నైట్ స్వీట్ తింటానండి. పడుకోలేనండి” అని నాగార్జున తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..
