బంగార్రాజు సినిమా పై క్లారిటీ.. త్వరలోనే షూటింగ్ మొదలు పెడతానంటున్న నాగార్జున..

కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్..

బంగార్రాజు సినిమా పై క్లారిటీ.. త్వరలోనే షూటింగ్ మొదలు పెడతానంటున్న నాగార్జున..
Nagarjuna
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Apr 26, 2021 | 8:51 AM

Akkineni Nagarjuna : కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్‏గా నటించింది. ఇటీవల ఓటీటీ లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది.  ఈ వయసులో కూడా కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు నాగ్ . అయితే నాగ్ నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్  హిట్ అయినా విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు నాగార్జున. అయితే ఈ సినిమా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.  నాగార్జున బంగార్రాజు సినిమా చేస్తున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. సోగ్గాడే చిన్నినాయనలో  నాగ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రాముగా, బంగార్రాజు గా నటించిన ఆకట్టుకున్నాడు నాగార్జున. అలాగే నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ , యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ నటించారు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు క్యారెక్టర్ తో సినిమాను ప్లాన్ చేసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ కానీ ఈ సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. అనుకోని కారణాల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. తాజాగా మరోసారి ‘బంగార్రాజు’ సినిమాకు సంబంధించిన న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారట నాగ్. కరోనా గ్యాప్ లో ఈ సినిమాకు సంభందించిన పనులు చేస్తున్నాడట దర్శకుడు . ఈ విషయం నాగ్ స్వయంగా చెప్పారు. నాగ్ మాట్లాడుతూ… ‘బంగార్రాజు’ కథనే సిద్ధం చేసుకుంటున్నాం. దర్శకుడు కల్యాణ్ కృష్ణ తో ఆన్లైన్లో మాట్లాడుతూ కథ గురించి చర్చించుకుంటున్నాం. షూటింగ్ లు మొదలు కాగానే ఆ సినిమాని మొదలు పెట్టనున్నాం అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

pawan kalyan: అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లోమార్పులు.. పవన్ కోసం ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారట..

RRR: ఆర్ఆర్ఆర్ లో అందమైన ప్రేమకావ్యం.. ఇద్దరు భామలతో ఎన్టీఆర్ ప్రేమాయణం

నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం బాలకృష్ణ.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య వీడియో..:Akhanda Teaser video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu