Ticket Hikes: సినిమా టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!

భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. నిన్నమొన్నటి వరకు రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపికబురు చెప్పేవి.. కానీ ఇప్పుడు ఆ రెండిట్లో తెలంగాణ లేదు. ఎందుకంటే పుష్ప 2 సంధ్య ఘటన తర్వాత పరిస్థితులన్నీ చాలా వేగంగా మారిపోయాయి. దానికితోడు ఇండస్ట్రీలో మారిన సిచ్యువేషన్స్ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సినిమాల టికెట్ హైక్స్‌కు నో చెప్పింది..

Ticket Hikes: సినిమా టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
Thandel Movie
Follow us
Praveen Vadla

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 05, 2025 | 7:07 PM

ఒకప్పుడు పెద్ద సినిమాలు విడుదలైతే ఎలా ఉంది..? హీరో ఎలా చేసాడు.. దర్శకుడు బాగా తీసాడా లేదా అని అడిగేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. ఓ స్టార్ హీరో సినిమా వస్తుంటే టికెట్ రేట్లు ఎంత పెంచారు..? ఒక్కో టికెట్‌పై ఏ రేంజ్ హైక్ ఇచ్చారు అని అడుగుతున్నారు అంటున్నారు. ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ కూడా టికెట్ రేట్లకు అలవాటు పడిపోయారు.. అలా పడేలా చేసారు మన దర్శక నిర్మాతలు. తాజాగా తండేల్ సినిమాకు ఇదే జరిగింది. ఈ సినిమాకు కూడా టికెట్ రేట్లు బాగానే పెరిగాయి.

పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. నిన్నమొన్నటి వరకు రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపికబురు చెప్పేవి.. కానీ ఇప్పుడు ఆ రెండిట్లో తెలంగాణ లేదు. ఎందుకంటే పుష్ప 2 సంధ్య ఘటన తర్వాత పరిస్థితులన్నీ చాలా వేగంగా మారిపోయాయి. దానికితోడు ఇండస్ట్రీలో మారిన సిచ్యువేషన్స్ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సినిమాల టికెట్ హైక్స్‌కు నో చెప్పింది.. దాంతో పాటు నో అడీషినల్ షోస్ అంటూ కోర్టు తీర్పిచ్చింది.

మరోవైపు ఏపీలో మాత్రం సినిమాలపై వరాల జల్లు కురిపిస్తూనే ఉంది అక్కడి ప్రభుత్వం. టికెట్ రేట్లు భారీగా పెంచుకునే వెసలుబాటు కల్పిస్తుంది. తాజాగా తండేల్‌కు కూడా సింగిల్ స్క్రీన్ 50 రూపాయలు.. మల్టీప్లెక్స్‌లో 75 రూపాయలు పెంచుకునే వెసలుబాటు కల్పించింది.

వారం రోజుల పాటు ఈ రేట్లు అందుబాటులో ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం అలాంటి వెసలుబాట్లేవీ లేవు. అశ్వినీదత్ నిర్మించిన కల్కి సినిమాకు భారీగానే టికెట్ రేట్లు పెంచాయి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగే పుష్ప 2కు కూడా భారీగానే ఇచ్చారు. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి టికెట్ హైకులు లేకుండా.. ఎక్స్ ట్రా షోలు లేకుండా.. ఎర్లీ మార్నింగ్ షోలు లేకుండా చాలా కాలం తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా తండేల్. మరి ఈ మార్పు మంచికేనా