Pawan Kalyan: ఫ్యాన్స్ మాట పవన్ వింటారా..? వాళ్లు చెప్పింది చేస్తారా..?

పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఎలా ఉంటుందో అన్నీ తెలిసే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కమిటయ్యారు. అడ్వాన్సులు కూడా ఇచ్చారు. ఆయన అధికారంలో లేనపుడే కాల్షీట్స్ ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఉండేది కాదు.. ఇప్పుడాయన డిప్యూటీ సిఎం.. మరో మూడు నాలుగు శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో పవన్ నుంచి సినిమాలు ఆశించడం అనేది అత్యాశే అవుతుంది. అయితే ఆయన ఒప్పుకున్న సినిమాల్లో దాదాపు అన్నీ చివరి దశకు వచ్చేయడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే విషయం.

Pawan Kalyan: ఫ్యాన్స్ మాట పవన్ వింటారా..? వాళ్లు చెప్పింది చేస్తారా..?
Pawan Kalyan
Follow us
Praveen Vadla

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 05, 2025 | 6:58 PM

పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఎలా ఉంటుందో నిర్మాతలకు బాగా తెలుసు. అన్నీ తెలిసే ఆయనతో సినిమాలు చేయడానికి కమిటయ్యారు.. అడ్వాన్సులు కూడా ఇచ్చారు. ఆయన అధికారంలో లేనపుడే కాల్షీట్స్ ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఉండేది కాదు.. ఇప్పుడాయన డిప్యూటీ సిఎం.. మరో మూడు నాలుగు శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో పవన్ నుంచి సినిమాలు ఆశించడం అనేది అత్యాశే అవుతుంది. అయితే ఆయన ఒప్పుకున్న సినిమాల్లో దాదాపు అన్నీ చివరి దశకు వచ్చేయడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే విషయం.

అందుకే మిగిలిన సినిమాలను కూడా పూర్తి చేస్తే అయిపోతుంది కదా అనేది దర్శక నిర్మాతల భావన. అయితే ఫ్యాన్స్ నుంచి మాత్రం పవన్‌కు కొన్ని విన్నపాలు వస్తున్నాయి.. వాటిని ఎంతవరకు ఆయన తీసుకుంటాడనేది చూడాలి. తాను డేట్స్ ఇచ్చినపుడు దర్శక నిర్మాతలు యూజ్ చేసుకోలేదు అని పవన్ చెప్తున్న మాట.. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ డేట్స్ ఏవో ఇంకొక్కసారి ఇవ్వండి అన్నయ్యా.. ఈసారి పక్కా పూర్తి చేస్తారు.. మాది హామీ అంటున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. అందులో 2 దాదాపు పూర్తయ్యాయి. ఒకటి మాత్రం 10 శాతం మాత్రమే పూర్తైంది. మూడోది పక్కనబెట్టినా పర్లేదు కానీ ముందు అయితే ఆ రెండు సినిమాల్ని పూర్తిచేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్.

వాటికి కూడా పెద్దగా టైమ్ అవసరం లేదు. ఎందుకంటే హరిహర వీరమల్లు షూటింగ్‌కు ఇంకా వారం రోజులు మాత్రమే వస్తే సరిపోతుంది అంటున్నారు మేకర్స్. పవన్ కూడా ఇదే చెప్పారు.. 8 రోజులు వస్తే సరిపోతుంది అని..! కానీ ఆయనున్న బిజీకి ఆ వారం రోజుల టైమ్ కూడా దొరకడం లేదు. మరోవైపు ఓజి కూడా అంతే. రెండు వారాలు డేట్స్ ఇస్తే ఈ సినిమా బయటపడుతుంది. ఇప్పుడున్న సమయంలో పవన్ అంత కాన్సట్రేట్ చేస్తారా అనేది కాస్త అనుమానమే కానీ ఆయన అనుకుంటే అవ్వని పని అంటూ ఉండదు. మరి చూడాలిక.. పవన్ ఆ నిర్మాతలను కరుణిస్తారా..? డేట్స్ ఇస్తారా లేదా అని..? మొత్తానికి ఫ్యాన్స్ విన్నపమైతే ఇదే..!