Naga Chaitanya : మనందరి జీవితాల్లో బెస్ట్ టైమ్ అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగచైతన్య

|

Jun 28, 2022 | 7:47 AM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya)నటిస్తున్న లేటెస్ట్ మూవీ థ్యాంక్యూ. ఇటీవలే లవ్ స్టోరీ , బంగార్రాజు సినిమాలతో హిట్స్ అందుకున్న చైతన్య ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Naga Chaitanya : మనందరి జీవితాల్లో బెస్ట్ టైమ్ అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగచైతన్య
Naga Chaitanya
Follow us on

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya)నటిస్తున్న లేటెస్ట్ మూవీ థ్యాంక్యూ. ఇటీవలే లవ్ స్టోరీ , బంగార్రాజు సినిమాలతో హిట్స్ అందుకున్న చైతన్య ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి మనంలాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా, రెండు పాటలు “మారో..”, “ఏంటో ఏంటేంటో…” చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా ఈ చిత్ర నుంచి ఫేర్ వెల్ అనే పాటను మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్య, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు విక్రమ్ కె కుమార్, సంగీత దర్శకుడు థమన్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

చైతూ మాట్లాడుతూ.. మనందరి జీవితాల్లో బెస్ట్ టైమ్ కాలేజ్ లైఫ్. ఆ తర్వాత అంతా ప్రపంచంతో పోటీ పడుతూ పరుగులు పెట్టాల్సిందే అన్నారు. మనం ఇక్కడ నేర్చుకున్న విషయాలే జీవితాంతం మనల్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే ఈ కాలేజ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయండి. యూత్ సినిమాను ఎలా ఇష్టపడతారో అనేదే ఆలోచిస్తాం. రిలీజ్ రోజే థ్యాంక్యూ సినిమా చూడండి. సోషల్ మీడియా ద్వారా మీ స్పందన చెప్పండి. మీ ఫీడ్ బ్యాక్ కోసం వేచి చూస్తుంటాను. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు విక్రమ్ కుమార్ కు కృతజ్ఞతలు చెబుతున్నా. మూడేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం. జూలై 22న సినిమా చూడండి. అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి