Naga Chaitanya: శోభితతో ఎంగేజ్‌మెంట్‌కు ముందే.. సమంత ఫొటోలు డిలీట్ చేసిన చైతూ.. ఆ ఒక్క పిక్ మాత్రం అలాగే..

|

Aug 10, 2024 | 5:20 PM

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. సమంతతో విడాకులు తీసుకున్న అతను త్వరలోనే మళ్లీ పెళ్లి పీటలెక్కనున్నాడు. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడు. గురువారం (ఆగస్టు 08) వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది

Naga Chaitanya: శోభితతో ఎంగేజ్‌మెంట్‌కు ముందే.. సమంత ఫొటోలు డిలీట్ చేసిన చైతూ.. ఆ ఒక్క పిక్ మాత్రం అలాగే..
Naga Chaitanya, Sobhita Dhulipala, Samantha,
Follow us on

 

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. సమంతతో విడాకులు తీసుకున్న అతను త్వరలోనే మళ్లీ పెళ్లి పీటలెక్కనున్నాడు. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడు. గురువారం (ఆగస్టు 08) వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనంతరం నాగ చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ ఫొటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. కాబోయే దంపతులను ఆశీర్వదించాలని కోరారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు చైతూ, శోభితలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే శోభితతో నిశ్చితార్థానికి ముందే సమంతతో ఉన్న జ్ఞాపకాలను పూర్తిగా తొలగించేశాడు నాగ చైతన్య. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫొటోలన్నింటనీ డిలీట్ చేశాడు. అయితే సమంత ఉన్న ఒక పిక్ మాత్రం నాగచైతన్య సోషల్ మీడియా అకౌంట్ లో అలాగే ఉంది. ఈ ఫొటో వాళ్లిద్దరూ కలిసి నటించిన మజిలీ సినిమా లోనిది. ఆ సినిమా పోస్టర్ లో సామ్ స్టైలిష్ గా కనిపిస్తుండగా..నాగ చైతన్య మాత్రం తలకు హెల్మెట్ తో ఉండటం చూడొచ్చు. 2018లో పోస్ట్ చేసిన ఈ ఫొటోకు ‘మిసెస్ అండ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే క్యాప్షన్ ఇచ్చాడు అక్కినేని హీరో.

ఇవి కూడా చదవండి

సమంత అన్ని ఫొటోలను డిలీట్ చేసిన నాగ చైతన్య ఈ ఫొటో మాత్రం ఎందుకు డిలీట్ చేయలేదో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే సమంత అభిమానులు మాత్రం ‘ సామ్ జ్ఞాపకాలన్నీ తుడి చేశావ్. ఇది మాత్రం ఎందుకు డిలీట్ చేయలేదు’ అంటూ చైతన్యను నిలదీస్తున్నారు.

నాగ చైతన్య ఇన్ స్టా గ్రామ్ లో సమంత ఫొటో..

కాగా గత కొన్ని రోజులుగా చైతన్య, శోభితా ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరి కలిసున్న ఫొటోలు కూడా బయటకు రావడంతో ఇది నిజమేననుకున్నారు. అయితే తమ డేటింగ్ విషయంపై నాగ చైతన్య, శోభిత కానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు. తాజాగా గురువారం నిశ్చితార్థం వేడుకతో తమ గురించి వస్తున్న రూమర్లను నిజం చేశారీ ప్రేమ పక్షులు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. అలాగే శోభితా హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది.

నాగ చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ ఫొటోలు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.