మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి నా పేరు సీసా అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన నా పేరు సీసా సాంగ్ ప్రోమో అదిరిపోయింది. అన్వేషి జైన్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శ్రేయఘోషల్, శ్యామ్ సీఎస్ ఆలపించారు. ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను జూలై 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.