ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఇన్నాళ్లు క్రేజీ అప్డేట్స్.. ఎన్నో రూమర్స్ మధ్య రోజు రోజుకీ అభిమానులలో క్యూరియాసిటిని పెంచేసిన ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా టైటిల్‌ని ‘గుంటూరు కారం’గా ఫిక్స్ చేశారు. ఇన్ని రోజుల నుంచి ఫ్యాన్స్ టైటిల్ ఏంటా అని.. ఎదురుచూశారు.. ఇప్పుడు SSMB28కి గుంటూరు కారం టైటిల్ ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసారు. ఇందులో మహేష్ బాబు ఊర మాస్‌గా కనిపిస్తున్నారు. ఇందులో మహేశ్ స్వాగ్ అదిరిపోయింది.
‘ఏందట్టా చూస్తున్నావు, బీడీ త్రీడీలో కనపడ్తుందా?’ అంటూ మహేష్ బీడీ ముట్టించుకున్న తీరుకు ఫ్యాన్స్ విజిల్స్ వేయడం ఖాయం. మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ అయిన థియేటర్లలోనే గుంటూరు కారం టీజర్‌ను విడుదల చేసారు. ఈ సినిమాను 2024 జనవరి 13న విడుదల చేయనున్నారు. ఇందులో మహేష్ జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత గుంటూరు కారంతో మహేశ్- త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి జతకట్టడంతో ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఇదిలా ఉంటే సాయంత్రం విడుదలైన గ్లింప్స్ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మహేష్ బాబు స్వాగ్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ అభిమానులకు భరోసా ఇచ్చారు. గుంటూరు కారం ఆల్బమ్ సూపర్ మాస్ గా ఉంటుందని థమన్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి గుంటురు కారం సౌండ్ అదిరిపోతుందన్నారు. థమన్ గతంలో సూపర్‌స్టార్‌కి చాలా సూపర్‌హిట్ ఆల్బమ్‌లను అందించాడు. గుంటూరు కారం కూడా సూపర్ హిట్ ఆల్బమ్ అవుతుంది అని అభిమానులు భావిస్తున్నారు.
Will Promise U all A #SuperMassAlbum for sure ?????this 2024 #Sankranthi TILL OUR NEXT SOUND LETS VIBE TO OUR VERY OWN DEAR?#SuperStar @urstrulyMahesh ♥️ gaaru ‘s #GunturKaaram ??
& to My dearest Dir #Trivikram gaaru Who made it and making possible ❤️ Everytime ?♥️…
— thaman S (@MusicThaman) May 31, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.