AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R. P. Patnaik: పాటను పాటలా చూడాలి.. నా సాంగ్‌కు డాన్స్ చేస్తూ ఓ వక్తి చనిపోయాడు..

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మంచి మ్యూజిక్ అందించారు. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు .

R. P. Patnaik: పాటను పాటలా చూడాలి.. నా సాంగ్‌కు డాన్స్ చేస్తూ ఓ వక్తి చనిపోయాడు..
Rp Patnaik
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2026 | 12:41 PM

Share

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్  ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. ఆయన మ్యూజిక్ అందించిన సినిమా ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఆర్ఫీ పట్నాయక్ తన సంగీత ప్రయాణం, ప్రసిద్ధ పాటల వెనుకటి కథనాలను, తన పనితీరును ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు తేజతో తన అనుబంధాన్ని వివరిస్తూ, తామిద్దరం ఎప్పుడూ కలిపి పనిచేయలేదని, తేజ ఒక సన్నివేశాన్ని వివరిస్తే తాను వెంటనే ట్యూన్‌ను సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు ఏం కావాలో చాలా స్పష్టంగా ఉంటుందని, ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ట్యూన్ చేసి, అనూపమ్‌తో కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేయించి పాట రికార్డింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. నువ్వు నేను చిత్రం కోసం ఒక ప్రత్యేకమైన పాట గురించి ఆర్పీ పట్నాయక్ వివరించారు. ఒక పార్టీలో అబ్బాయి, అమ్మాయి పాట పాడే సన్నివేశం కోసం ట్యూన్ చేయమని తనకు, లిరిక్ రాయమని కులశేఖర్‌కు విడివిడిగా చెప్పారని తెలిపారు. తాను ట్యూన్ చేయగా, కులశేఖర్ లిరిక్ రాశారని చెప్పారు.

ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

గాజువాక పిల్లా పాట తనకు చాలా గర్వాన్ని, గౌరవాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని ఆర్పీ పట్నాయక్ వెల్లడించారు. ఈ పాట గురించి అనేక కథలు ఉన్నాయని, భారతీయ సైనికులు కూడా దీనిని పాడుకునేవారని చెప్పారు. అయితే, ఈ పాట విజయం వెనుక ఒక ప్రతికూల సంఘటన కూడా ఉందని పంచుకున్నారు. ఒక పెళ్లి వేడుకలో పెళ్ళికొడుకు సోదరుడు బాగా మద్యం సేవించి, ఈ పాట పాడమని రిపీట్ మోడ్‌లో అడిగాడని తెలిపారు. ఉదయం వరకు అదే పాటకు డాన్స్ చేస్తూ అలసిపోయి, చివరికి మరణించాడని ఆ విషాద సంఘటనను వివరించారు. ఒక పాట ఎంత సానుకూల ప్రభావాన్ని చూపుతుందో, దాన్ని అతిగా తీసుకుంటే అంతే ప్రతికూల ప్రభావాన్ని కూడా ఇస్తుందని ఈ సంఘటన నిదర్శనమని అన్నారు.

ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

పాటను పాటలాగే ఆస్వాదించాలని ఆయన అభిప్రాయపడ్డారు. విక్రమ్ నటించిన తొమ్మిది నెలలు చిత్రానికి తాను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశానని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. దర్శకుడు క్రాంతి కుమార్ చివరి దశలో ఉన్నప్పుడు, తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఆయన లాంటి పెద్ద దర్శకుడితో పనిచేయాలనే ఉద్దేశంతో తాను ఈ పని చేశానని చెప్పారు. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ సహ-దర్శకుడిగా పనిచేశారని, అక్కడి నుంచే ఆయనతో తన ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు. తొమ్మిది నెలలు సినిమా రికార్డింగ్ సమయంలోనే తాను సౌందర్య అద్భుతమైన నటన కనబరచినప్పటికీ, విక్రమ్ పెద్ద స్టార్ అవుతాడని తన టీమ్ అందరికీ చెప్పానని తెలిపారు. విక్రమ్ పాత్రలో సంఘర్షణ, ప్రతికూల షేడ్స్ రెండూ కలిపి చూపించడం చాలా కష్టమని, అలాంటి నటన చేయగలిగిన ఆయన భవిష్యత్తులో పరిశ్రమను దున్నేస్తారని అప్పుడే అంచనా వేశానని ఆర్పీ పట్నాయక్ గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us