
ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా, యాక్షన్, గ్లామర్ సాంగ్స్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద హిట్టైన చిత్రాలు అనేకం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా దాదాపు 12 ఏళ్లు థియేటర్లలో రచ్చ చేసింది. 2006లో భారీ బడ్జెట్ సినిమాలు మనుగడ కోసం పోరాడుతున్నప్పుడు.. ఒక చిన్న కన్నడ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. అదే ముంగారు మాలే. గణేష్, పూజా గాంధీ నటించిన ఈ మూవీ ఎలాంటి ప్రమోషన్స్, హడావిడి లేకుండానే థియేటర్లలో విడుదలైంది. కానీ ఆ తర్వాత ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. తక్కువ సమయంలోనే ఈ చిత్రం చరిత్ర సృష్టించింది.
ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..
ముంగారు మాలే థియేటర్లలో వరుసగా 460 రోజులు ప్రదర్శితమైంది. ఆ సమయంలో ఎవరూ ఊహించని ఘనత ఇది. మల్టీప్లెక్స్ లలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న మొదటి కన్నడ మూవీ ఇది. బెంగుళూరులోని పీవీఆర్ లో 12 నెలలకు పైగా ప్రదర్శన జరిగింది. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ రావడంతో అటు కమర్షియల్ హిట్ గా నిలిచింది. కేవలం 70 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఏకైక కన్నడ సినిమా ఇదే. ఈ సినిమా దాని ఖర్చుకు 100 రెట్లు ఎక్కువ రాబడిని రాబట్టింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఈ సినిమాకు సీక్వెల్ 2016లో వచ్చింది. అయితే రెండుసార్లు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2006 సినిమా క్రేజ్ దశాబ్దకాలంపాటు చెక్కుచెదరకుండా ఉంది. ఈ సినిమాకు ప్రధాన బలం కథాంశం. అన్ని వర్గాల అడియన్స్ ఈ చిత్రానికి ఫిదా అయ్యారు.
ఇవి కూడా చదవండి : Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..
ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..