చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.. క్రేజీ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంత సులువు కాదు. నిత్యం కొత్త అందాలు పలకరిస్తున్న ఈ సమయంలో అవకాశాలు అందుకోవడం కష్టమే..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంత సులువు కాదు. నిత్యం కొత్త అందాలు పలకరిస్తున్న ఈ సమయంలో అవకాశాలు అందుకోవడం కష్టమే.. కానీ ఈ అమ్మడు మాత్రం తన నటనతో అందంతో ఆఫర్లకుగాలం వేస్తుంది. `విట్టి దండు`మరాఠీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆ తర్వాత ఈ చిన్నది బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్ . ఈ సినిమా మంచి విజయం సాధించడం తోపాటు అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.. దాంతో ఆఫర్లు క్యూ కట్టాయి ఈ చిన్నదానికి. సూపర్ 30 తర్వాత ఇప్పుడు షాహిద్ కపూర్ నటిస్తున్న జెర్సీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తెలుగులో నాని నటించిన జెర్సీ కి రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు కెరీర్ స్టార్టింగ్ లో చాల ఇబ్బందులు ఎదుర్కొందట.. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో జరిగిన విషయాలను పంచుకుంది మృణాల్ ఠాకూర్.. 17 -20 ఏళ్ల వయసు మధ్యలో తాను ఇంటి నుంచి దూరంగా వున్నానని తెలిపింది. ముంబై మహా నగరంలో ఒంటరిగా జీవించానని.. చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది. అంతే కాదు చదువుకునే రోజుల్లో రోజూ లోకల్ ట్రైన్ లో తిరిగేదట.. ఆసమయంలో సీటు దొరికేది కాదని.. అలాంటప్పుడు ట్రైన్ లోనుంచి దూకేయాలనిపించేదని చెప్పుకొచ్చింది మృణాళిని. ఇక ఈ అమ్మడు త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు సినిమా లెఫ్టినెంట్ రామ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :