అందాల భామ మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది మృణాల్. తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. సీతారామం సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన నటించే ఛాన్స్ అందుకుంది. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో చేసింది ఈ భామ.
ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. హాయ్ నాన్న సినిమా తర్వాత తెలుగు హీరోయిన్ అయిపొయింది మృణాల్. ఆ తర్వాత విజయ్ దేవర కొండా హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో చేసింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.కానీ ఈ సినిమా నిరాశపరిచిన కూడా మృణాల్ క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. అయితే మృణాల్ ప్రస్తుతం తెలుగు సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఈ అమ్మడు తమిళ్ ఇండస్ట్రీలో బిజీ కానుందని తెలుస్తోంది. అయితే గతంలో తమిళ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినప్పుడు ఈ అమ్మడు మిస్ చేసుకుంది.
సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమాలో ముందుగా మృణాల్ కు ఛాన్స్ వచ్చింది. అయితే అప్పుడు ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడికి అదృష్టం తిరిగి వరించింది. సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఆర్జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ థ్రిల్లర్ స్టైల్‌లో రాబోతోంది. అలాగే ఈ సినిమాలో మృణాల్ తో పాటు రుక్మిణి వసంత్ కూడా నటిస్తుందని తెలుస్తోంది. మరి సూర్య సినిమాతో మృణాల్ కోలీవుడ్ లోనూ బిజీ అవుతుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.