చూస్తుండగానే కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. 2022 ముగియడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2023కు స్వాగతం పలకడానికి అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో ఈ ఏడాది జరిగిన కొన్ని విషయాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన టాప్- 10 సినిమాల జాబితాను విడుదల చేసింది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో విడుదలైన అల్లు అర్జున్ పుష్ప ఈ లిస్టులో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో యశ్ కేజీఎఫ్ 2 ఉండగా మూడో స్థానంలో కేజీఎఫ్ 1 ఉండడం గమనార్హం. ఇక నాలుగో స్థానంలో దుల్కర్ సల్మాన్ సీతారామం, ఐదో ప్లేసులో పొన్నియన్ సెల్వన్ 1 సినిమాలు ఉన్నాయి. ఈ జాబితాను పరిశీలిస్తే టాప్-5 సినిమాలు దక్షిణాదివే కావడం విశేషం. ఇంతకీ ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.
1. పుష్ప
2. కేజీఎఫ్ 2
3. కేజీఎఫ్ 1
4. సీతారామం
5. పొన్నియన్ సెల్వన్ 1
6. బచ్చన్ పాండే
7. జుగ్ జుగ్ జియో
8. రన్‌వే 34
9. జురాసిక్ వరల్డ్ డొమైన్
10. గెహ్రియాన్
#Pushpa is the most watched movie on Amazon prime in 2022..@alluarjun mass ???#PushpaTheRule #Pushpa2TheRule#AlluArjun pic.twitter.com/NFjwu6ODHn
— ᴀʟʟᴜ ᴀʀᴊᴜɴ™ (@BUNNY_RAJESH_) December 9, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..