
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో అతిథి పాత్రలో మెరిశారు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్. మాథ్యూ పాత్రలో కనిపించేది కొద్ది సేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారీ సీనియర్ హీరో. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న మోహన్‌లాల్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మలైకోట్టై వాలిబన్’ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వార్త విన్న అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . కాగా 2022లో ‘మలై కొట్టా వాలిబన్’ చిత్రాన్ని ప్రకటించారు. అయితే అంతకంతకూ ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. అయినా సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు గణేష్ చతుర్థి సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ గురించిన అప్ డేట్ వచ్చింది. ఈ విషయాన్ని మోహన్‌లాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘కౌంట్ డౌన్ మొదలైంది. వాలిబన్ జనవరి 25, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది’ మోహన్‌లాల్ అనౌన్స్ చేశారు.’మలై కొత్త వాలిబన్’ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కొత్త పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. మోహన్‌లాల్ కండలు తిరిగిన దేహంతో యోధుడి గెటప్‌లో కనిపించారు.
కాగా మలైకోటై వాలిబన్ సినిమాలో విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ వంటి బాలీవుడ్ స్టార్ యాక్టర్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జాన్-మేరీ క్రియేటివ్స్, మ్యాక్స్ ల్యాబ్ సినిమాస్ ఎంటర్టైన్మెంట్స్, సెంచురీ ఫిలిమ్స్, ఆమెన్ మూవీ మొనాస్టరీ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శిబు బేబీ జాన్, మోహన్ లాల్, లిజో జోస్ పెల్లిస్సేరీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ పిళ్లై ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, డీప్ ఎస్. జోసెఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మలయాళం, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ తనయుడు రోహన్‌తో కలసి వృషభ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు మోహన్‌లాల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.