Vijay Antony: ‘నా బలం వెనుక ఉన్న శక్తి.. నా కన్నీళ్లకు ఓదార్పు తనే’.. కూతురితో ఫాతిమా అనుబంధం..
మీరా ఆత్మహత్య చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో, అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. ఆ చిన్నారి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ నటీనటులు విజయ్ ఇంటికి వెళ్లి ఆంటోని, ఫాతిమా దంపతులను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తన కూతురి గురించి తల్లి ఫాతిమా ట్వీట్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. పాఠశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఎన్నికైన తన కుమార్తె మీరాను అభినందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఫాతిమా.

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 19న తెల్లవారుజామున ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. ఆ చిన్నారి భౌతికకాయాన్ని నివాళులర్పించేందుకు చెన్నై అల్వార్ పేటలోని ఇంటికి తీసుకువెళ్లారు. ఒత్తిడి, డిప్రెషన్ కారణంగానే మీరా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీరా ఆత్మహత్య చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో, అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. ఆ చిన్నారి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ నటీనటులు విజయ్ ఇంటికి వెళ్లి ఆంటోని, ఫాతిమా దంపతులను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తన కూతురి గురించి తల్లి ఫాతిమా ట్వీట్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. పాఠశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఎన్నికైన తన కుమార్తె మీరాను అభినందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఫాతిమా.
“నా బలం వెనుక ఉన్న శక్తి. నా కన్నీళ్లకు ఓదార్పు. నా ఒత్తిడిని తగ్గించే తన అల్లరి. నా తంగకట్టి.. చెల్లకుట్టి మీరా విజయ్ ఆంటోని. కంగ్రాట్స్ మై బేబీ ” అంటూ తన కూతురి ఫోటోను పంచుకున్నారు ఫాతిమా. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుండడంతో తల్లి కూతురు అనుబంధం.. మీరా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచి వేస్తుంది. కూతురు మరణం నుంచి ఫాతిమా, విజయ్ ఎలా కోలుకుంటారు ?.. ప్రస్తుతం వారి మానసిక స్థితిని ఊహించుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
The Force behind my strength,the consolations to my tears,the reason for my stress(Naughtiness super loaded)my Thangakatti-chellakutty. Meera Vijay Antony ,Congrats Baby 🤗❤️🥰🔥🔥🔥 pic.twitter.com/yfTTdIiAjL
— Fatima (@mrsvijayantony) March 12, 2023
విజయ్ ఆంటోని తమిళ చిత్రసీమలో ప్రముఖ సంగీత స్వరకర్త, నటుడు. కోలీవుడ్ లో ఎన్నో హిట్ సాంగ్స్ అందించిన ఆయన ఇప్పుడు నటనపై దృష్టి సారించారు. సినిమాల్లో, ఇంటర్వ్యూల్లో ఎలాంటి ప్రదర్శన లేకుండా ప్రశాంతంగా మాట్లాడగల విజయ్ ఆంటోని అభిమానులందరికీ నచ్చేవాడు. ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని సూపర్ హిట్ అందుకున్నారు. అంతలోనే తీరని విషాదం ఆయన జీవితంలో చేరింది.
In March of this year, Mrs.Fatima Vijay Antony was so happy that her daughter #MeeraVijayAntony become the cultural secretary of her school students association..
We all congratulated her on Twitter..
She was the world to her parents..
Can’t imagine the pain 💔 😢 https://t.co/aFvuWwcX5I
— Ramesh Bala (@rameshlaus) September 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




