మంచు కుటుంబంలో మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. శనివారం (డిసెంబర్ 14) న రాత్రి మనోజ్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ఓ జనరేటర్ ఏర్పాటు చేసుకున్నాడని, అయితే అందులో విష్ణు అనుచరులు పంచదార కలిపినట్లు మనోజ్ ఆరోపించాడు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మంచు మనోజ్ మరోసారి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విష్ణుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ‘నాకుటుంబం హత్యకు కుట్ర పన్నారు. జనరేటర్ లో చక్కెర కలిపిన డీజిల్ పోశారు. తద్వార విద్యుత్ సరఫరాలో భయంకరమైన హెచ్చు తగ్గులు తలెత్తాయి. మాఅమ్మ, తొమ్మిది నెలల పాప బందువులు ఇంట్లో తీవ్ర ఇబ్బంది పడ్డారు.
విష్ణుతో పాటు ఆయన అనుచరులు కలిసి కుట్ర పన్నారు. నా తల్లి బర్త్ డే అడ్డం పెట్టుకొని ఇంట్లోకి చొరబడ్డారు. ఈ విషయం గురించి బయట చెప్పదని మా కోచ్ ను సైతం బెదిరించారు. పోలీసులు హెచ్చరించినా నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను’ అని మనోజ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ విషయంలో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు మనోజ్ పేర్కొన్నాడు .
అంతకుముందు దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీవీ ప్రతినిధి రంజిత్‌ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్‌తో పాటు అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలో మంచు విష్ణు కూడా మోహన్ బాబు వెంటే ఉన్నారు.
Another Manchu Family Dispute at Jalpally :
Actor Manchu Manoj is set to visit Pahadi Shareef Police Station over a new controversy. Reportedly, Vishnu allegedly poured sugar into a generator belonging to Manoj, disrupting the electricity supply to his house.#ManchuFamily pic.twitter.com/8TAsUFoasN
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) December 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.