Nagarjuna-Komati Reddy: నాగార్జునపై మంత్రి కోమటిరెడ్డి ట్వీట్.. అక్కినేని హీరో రియాక్షన్ ఏంటంటే?

అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖల మధ్య వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. తను చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం, ఆ వెంటనే అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకోవడంతో ఈ కాంట్రవర్సీకి తెరపడింది.

Nagarjuna-Komati Reddy: నాగార్జునపై మంత్రి కోమటిరెడ్డి ట్వీట్.. అక్కినేని హీరో రియాక్షన్ ఏంటంటే?
Komatireddy Venkat Reddy, Akkineni Nagarjuna

Updated on: Nov 14, 2025 | 7:48 PM

అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ క్టాసిక్ సినిమా శివ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ శుక్రవారం (నవంబర్ 14)న మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయ్యింది. అత్యాధునిక హంగులతో, 4కె విజువల్స్‌తో శివ సినిమా ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తోంది. శివ సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలు ఆల్ ది బెస్ట్ చెబుతూ వీడియోలు రిలీజ్ చేశారు. తాజాగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. నటుడిగా నాగార్జున ప్రయాణం భావితరాలను ప్రభావితం చేస్తునే ఉంటుందంటూ అక్కినేని హీరోపై ప్రశంసలు కురిపించారు.

‘ప్రియమైన నాగార్జున.. శివ తెలుగు సినిమాను పునర్నిర్వచింది. ఒక నటుడిగా ఇందులో మీరు ఎంతో గొప్పగా మెప్పించారు. మిమ్మల్ని మరొకరు అందుకోలేరు. అక్కినేని నాగేశ్వరరావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. సినిమా పరిశ్రమ పట్ల మీ నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. శివ సినిమా రీరిలీజ్‌‌ సందర్భంగా, మీకు నా శుభాకాంక్షలు. శివ నుంచి అన్నమయ్య, షిర్డీ సాయితో పాటు నాకు ఎంతో ఇష్టమైన భక్త రామదాసు వంటి దివ్యమైన చిత్రాలతో మీ ప్రయాణం తరతరాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. శివ మరోసారి గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని నాగార్జున ను ట్యాగ్ చేస్తూ విషెస్ చెప్పారు కోమటి రెడ్డి.

ఇవి కూడా చదవండి

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్..

మంత్రి ట్వీట్ కు నాగార్జున కూడా స్పందించారు. ‘ మీ స్ఫూర్తిదాయకమైన మాటలు, శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు..!! దయచేసి మీకు సమయం దొరికినప్పుడు మా సినిమా చూడండి’ అని రిప్లై ఇచ్చారు నాగ్.

థియేటర్లలో నాగార్జున అభిమానుల సందడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.