AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లగా ఉన్నావ్.. సినిమాలకు పనికిరాదన్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోంది.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ అందాల తార చిన్నప్పుడే బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొంది. నల్లగా ఉన్నావని అవమానాలు ఫేస్ చేసింది. అయితే వాటికి కుంగిపోక ధైర్యంగా నిలబడింది. ఇప్పుడు తన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీని ఏలుతోంది. ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.

నల్లగా ఉన్నావ్.. సినిమాలకు పనికిరాదన్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోంది.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Nov 14, 2025 | 7:07 PM

Share

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ కుర్రది స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటిస్తోంది. తన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీని ఏలుతోంది. ఈ ముద్దుగుమ్మకు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం భారత దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. అయితే చాలా మంది హీరోయిన్లలాగే ఈ ముద్దుగుమ్మ బాడీ షేమింగ్ ఎదుర్కొంది. అది కూడా చిన్నతనంలోనే. ఈ బ్యూటీ స్కూల్ లో చదువుకునేటప్పుడు నల్లగా ఉన్నావని చాలా మంది అవమానించారు. ఇక మోడలింగ్ చేస్తున్నప్పుడు కూడా వివక్ష ఎదుర్కొంది. ఆమె కలర్ చూసి సినిమాలకు అసలు పనికిరావన్నారట. దీంతో ఈ సొగసరి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో మళ్లీ మాములు మనిషయ్యింది.

ఇవి కూడా చదవండి

ఆత్మ విశ్వాసం, మనో ధైర్యంతో అన్ని ఇబ్బందులను అధిగమించింది. అందాల పోటీల్లో పాల్గొంది. మిస్ వరల్డ్ కిరీటం గెల్చుకుని తనను అవమానించినవారికి తగిన సమాధానమిచ్చింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. భారతీయ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.

మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..

మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం గ్లోబ్ ట్రాటర్ (వర్కింగ్ టైటిల్). యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్టులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మందాకినీ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది. ఇటీవలే ఎస్ఎస్ఎమ్ బీ 29 సినిమా నుంచి ప్రియాంక ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక చోప్రాకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా అదే.

మహేష్ బాబు రిలీజ్ చేసిన వీడియో..

 జియో హాట్ స్టార్ లో గ్లోబ్ ట్రాటర్ లైవ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.